Breaking News

ప్రమాదం ఎలా జరిగింది?

Published on Sun, 04/14/2024 - 04:57

సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ఎస్‌బీ ఆర్గానిక్స్‌లో పదిరోజుల కిందట జరిగిన అగ్నిప్రమాద ఘటన కేసు దర్యాప్తులో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇది మంటల వ్యాప్తితో జరిగిన అగ్ని ప్రమాదం కాదని, పేలుడు వల్ల జరిగిన విస్పోటన మని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చా రు. ఈ పరిశ్రమలో పేలుడుకు పదార్థాల (ఎక్స్‌ ప్లోసివ్‌)కు సంబంధించిన ఉత్పత్తుల కార్యక లాపాలు జరిగినట్లు భావిస్తున్నారు.

ఈ పరిశ్రమకు ఏ రకమైన ఉత్పత్తులు తయారు చేసుకునేందుకు అనుమతులు ఉన్నాయి.. ఇక్కడ ఏ ఉత్పత్తులకు సంబంధించిన కార్యకలాపాలు జరిగాయి. అనే కోణంలో పరిశీలిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా చందాపూర్‌లో ఉన్న ఈ పరిశ్రమలో ఈనెల 3న జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో ఆరుగురు సజీవ దహనమైన విషయం విదితమే.

సుమారు 17 మందికి తీవ్ర గాయాలు కాగా, మరో 20 మంది స్వల్ప గాయాలతో బయటపడ్డారు. రియాక్టర్‌ పేలిన ఘటనలో ఈ ఫ్యాక్టరీ పూర్తిగా శిథిలమైపోయింది. చుట్టు పక్కల ఉన్న భవనాలు కూడా దెబ్బతిన్నాయి. ఎక్స్‌ప్లోసివ్‌ (పేలుడు పదార్థాల)కు సంబంధించిన కార్యకలాపాలు ఈ ఫ్యాక్టరీలో జరిగాయనే దానిపై నిర్ధారణకు వచ్చారు.

డీఆర్‌డీవో సహకారం కోరిన పోలీసులు
ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టేందుకు పోలీసులు రక్షణశాఖకు సంబంధించిన డీఆర్‌డీఓ (డిఫెన్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌) సహకారాన్ని కోరారు. ఈ మేరకు పోలీసుశాఖ డీఆర్‌డీఓకు లేఖ రాసింది. అలాగే ఈ ఘటనా స్థలాన్ని పరిశీలించేందుకు ఓ బృందాన్ని పంపాలని పోలీసులు ఐఐసీటీ (ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ) సంస్థకు కూడా లేఖ రాశారు.

40 శాంపిల్స్‌ సేకరణ..
ఫ్యాక్టరీలో జరిగిన పేలుడు కారణంగా చెల్లాచెదురైన శిథిలాల నుంచి కెమికల్స్‌కు సంబంధించిన శాంపిల్స్‌ను  ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ అధికారులు సేకరించారు. మొత్తం 40 చోట్ల ఈ శ్యాంపిల్స్‌ను సేకరించి ఫోరెన్సిక్‌ ల్యాబ్‌లో పరిశీలిస్తున్నారు. ఈ కేసులో లోతైన విచారణ జరుపుతున్నామని సంగారెడ్డి ఎస్పీ సీహెచ్‌.రూపేష్‌ ‘సాక్షి’ ప్రతినిధితో చెప్పారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)