Breaking News

హైదరాబాద్‌: మంత్రాలు చేసి నా బిడ్డను చంపేశారు!

Published on Thu, 06/08/2023 - 14:16

సాక్షి, హైదరాబాద్‌: కుల్సుంపురా పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని భరత్‌నగర్‌ బస్తీలో ఆత్మహత్య చేసుకున్న టీనేజర్‌ వ్యవహారంలో కొత్త విషయం వెలుగు చూసింది. ఆమెను క్షుద్ర పూజలు చేసి బలవన్మరణానికి పాల్పడేలా చేశారంటూ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తమ ఇంటి ముందు ఎవరో క్షుద్ర పూజలు చేశారని, ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసినా వాళ్లు స్పందించలేదని నవ్య తల్లి చెబుతోంది. 

బుధవారం సాయంత్రం ఇంట్లోనే ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది నవ్య. అయితే తమ ఇంటి ముందు వారం నుంచి ఎవరో పూజలు చేస్తున్నారని, మంత్రాలు చేసి తన కూతురిని చంపేశారని నవ్య తల్లి వాపోతోంది. ‘‘గత వారం రోజులుగా ఇంటి ముందు క్షుద్రపూజలు చేస్తున్నారు. నిమ్మకాయలు, దీపాలు, బొమ్మలు, పసుపు-కుంకుమతో పూజలు చేస్తున్నారు. వాటిని ఫొటోలు తీశాం. వాటిని తొలగించి పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాం. కానీ,  

వాళ్ల నుంచి ఎలాంటి స్పందన లేదు. పోలీసులు చర్యలు తీసుకుని.. నిందితులను పట్టుకుని ఉంటే ఇవాళ నా కూతురు ప్రాణాలతో ఉండేదేమో అంటూ సాక్షితో మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకుంది నవ్య తల్లి.

బుధవారం ఉదయం కూడా నవ్య బాగానే ఉందని, తనను.. తన భర్తను పనులకు నవ్వుతూ సాగనంపిందని, ఇవాళ(గురువారం) కాలేజీకి వెళ్తానని కూడా నవ్య చెప్పిందని ఆమె జరిగిందంతా వివరించారు. మరోవైపు నవ్య కుటుంబ సభ్యుల ఆందోళనతో ఆత్మహత్య కేసును.. అనుమానాస్పద కేసుగా నమోదు  చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Videos

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)