Breaking News

ఉద్యోగం రావడం లేదని గృహిణి ఆత్మహత్య

Published on Thu, 01/02/2025 - 09:43

గచ్చిబౌలి: పోటీ పరీక్షలు రాసినా ఉద్యోగం రాకపోవడంతో తీవ్ర ఒత్తిడికి లోనైన ఓ గృహిణి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన గచ్చిబౌలి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసకు చెందిన పప్పల సతీష్‌ పోస్టల్‌ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగిగా పని చేస్తూ జీపీఆర్‌ఏ క్వార్టర్స్‌లోని 32సీలో నివాసం ఉంటున్నాడు. మంగళవారం రాత్రి భోజనం అనంతరం భార్య బాలమణి (31)తో కలిసి ఇద్దరు ఒకే గదిలో నిద్రపోయారు. 

బుధవారం ఉదయం 5.30 గంటలకు కుమారుడు చిద్విలాస్‌(7) తల్లి కనిపించకపోవడంతో ఏడుస్తూ హాల్‌లోకి వెళ్లాడు. పిల్లాడి ఏడుపు విన్న సతీష్‌ లేచి భార్యను పిలువగా పలకలేదు. మరో గది తలుపులు వెనక నుంచి గడియపెట్టి ఉండటాన్ని ఆయన గమనించాడు. ఎంత పిలిచినా స్పందించకపోవడంతో ఇరుగు పొరుగు వారి సహాయంతో తలుపులు విరగ్గొట్టి చూడగా..బాలమణి చున్నీతో సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరి వేసుకొని వేలాడుతూ కనిపించింది. 

అప్పటికే మృతి చెందిందని నిర్ధారించుకొని గచ్చిబౌలి పోలీసులకు సమాచారం అందించారు. కొద్ది సంవత్సరాలుగా బాలమణి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్న పోటీ పరీక్షలకు హాజరవుతూ ఉందని, ఉద్యోగం రాకపోవడంతో తీవ్ర ఒత్తిడికి లోనైందని కుటుంబ సభ్యులు తెలిపినట్లు పోలీసులు వెల్లడించారు. మృతదేహానికి ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.   

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)