Breaking News

తరగతి గదిలో బాలికపై లైంగిక దాడి!

Published on Sat, 08/24/2024 - 05:19

తిరుపతి క్రైమ్‌: సభ్యసమాజం తలదించుకునేలా.. తరగతి గదిలోనే ఓ బాలికపై లైంగిక దాడి జరిగిన దారుణ ఘటన తిరుపతిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తిరుపతి వెస్ట్‌ పోలీస్‌ స్టేషన్‌ సీఐ రామకృష్ణ తెలిపిన వివరాల మేరకు.. తిరుపతిలోని ప్రభుత్వ బాలికల వసతి గృహంలో ఉంటూ నెహ్రూ మున్సిపల్‌ హైస్కూల్లో 14 సంవత్సరాల విద్యార్థిని తొమ్మిదో తరగతి చదువుతున్నది. 

ఈ నెల 21వ తేదీన క్లాసులు జరిగిన అనంతరం పీటీ పీరియడ్‌లో విద్యార్థులంతా ఆటలాడుకోడానికి గ్రౌండ్‌కు వెళ్లారు. ఈ సమయంలో సత్యవేడుకు చెందిన.. ఓ ప్రైవేటు  కంపెనీలో డ్రైవర్‌గా పనిచేస్తున్న రిషి అనే యువకుడు స్కూలుకు వచ్చాడు. బాలికకు మాయమాటలు చెప్పి  క్లాస్‌ రూమ్‌లోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు.   

టీచర్‌ ఆరా తీయడంతో బయటపడ్డ వైనం 
బాలిక ప్రవర్తన వింతగా ఉండడంతో క్లాస్‌ టీచర్‌కు శుక్రవారం అనుమానం వచ్చింది. ఎందుకలా ప్రవర్తిస్తున్నావు.. ఆరోగ్యం సరిగా లేదా? అంటూ ప్రశి్నంచింది. బాలిక ఏం లేదంటూనే ఏడవడంతో టీచర్‌కు అనుమానం వచ్చి గట్టిగా నిలదీశారు.

దీంతో జరిగిన విషయాన్ని పూర్తిగా తెలిపింది. వెంటనే టీచర్‌ ప్రభుత్వ బాలికల హాస్టల్‌ సూపరింటెండెంట్‌కు సమాచారం అందించారు. సూపరింటెండెంట్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రిషిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలికను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)