Breaking News

అమెరికా నుంచి వచ్చి.. తాతను చంపిన మనవడు

Published on Sat, 02/08/2025 - 09:53

హైదరాబాద్‌: చిన్నప్పటి నుంచి తనను అందరిలా పెంచలేదని.. అందరిని చూసినట్లు తనను చూడలేదని తాతను కత్తితో పొడిచి చంపేశాడు ఓ మనవడు. అడ్డుకోబోయిన కన్నతల్లిని గాయపరిచాడు. ఈ దారుణ ఘటన పంజగుట్ట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో గురువారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీఎస్‌ మక్తాలో నివాసం ఉండే వి.చంద్రశేఖర జనార్దన్‌ రావు (86) వ్యాపారవేత్త. ఇతను వెల్జాన్‌ గ్రూప్‌ ఆఫ్‌ ఇండస్త్రీ చైర్మన్‌. 

ఆయనకు సరోజ అనే కూతురు. ఆమె భర్త బెంగళూరులో ఉండగా.. సరోజ తండ్రి జనార్దన్‌ రావుతో కలిసి బీఎస్‌ మక్తాలో ఉంటోంది. సరోజ కొడుకు కిలారు కార్తి తేజ (29) అమెరికాలో మాస్టర్స్‌ పూర్తి చేసి నగరానికి తిరిగి వచ్చాడు. తాత ఆస్తి కోసం నిత్యం గొడవ పడేవాడు. అందరినీ చూసినట్లు తనను చూడడంలేదని.. అందరిలా తనను పెంచలేదంటుండేవాడు. ఈ విషయంలో తాతతో విభేదించి  కార్తితేజ ల్యాంకోహిల్స్‌లో స్నేహితులతో కలిసి ఉంటున్నాడు. గురువారం రాత్రి   బీఎస్‌ మక్తాకు వచ్చి ఆర్థిక లావాదేవీల గురించి తల్లి, తాతతో గొడవకు దిగాడు.   

తన వెంట తెచ్చుకున్న కత్తితో తాత జనార్దన్‌ రావు కడుపులో పొడిచాడు. అడ్డుకున్న తల్లి సరోజను గాయపరిచాడు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. అంతలోపే కార్తి తేజ అక్కడి నుంచి పరారయ్యాడు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి అప్పటికే జనార్దన్‌ రావు మృతి చెందినట్లు నిర్ధారించారు. గాయాలపాలైన సరోజను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు కార్తి తేజ కోసం గాలిస్తున్నారు.   

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)