Breaking News

అయ్యో వైష్ణవి 

Published on Wed, 04/10/2024 - 06:00

దుండిగల్‌: మూడేళ్ల వయస్సు ఉన్నప్పుడే తల్లి వదిలేసి వెళ్లిపోయింది.. రెండేళ్ల క్రితం తండ్రి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పదకొండేళ్ల వయస్సులోనే ఈ రెండు ఘటనలు ఆ బాలికను కలచివేశాయి. అయినాసరే తట్టుకుని చదువుతోంది.. కానీ ఇప్పుడు అర్ధంతరంగా ఏమైందో ఏమో అనుమానాస్పద స్థితిలో అనాథాశ్రమంలో బలవన్మరణానికి పాల్పడింది.

సూరారం ప్రాంతానికి చెందిన దివంగత నీలం సతీశ్‌ కుమార్తె వైష్ణవి(11) దుండిగల్‌లోని స్పూర్తి ఫౌండేషన్‌లో ఆరవ తరగతి చదువుతూ అక్కడే ఉంటోంది. వదిన పెళ్లి ఉండటంతో ఈ నెల 3న ఇంటికి వెళ్లిన వైష్ణవి అక్కడ బంధువులతో సంతోషంగా గడిపింది. 8న తిరిగి ఫౌండేషన్‌కు వచ్చింది. ఉదయం తోటి స్నేహితులతో కలిసి ఆనందంగా ఆటలు ఆడింది. అదే రోజు మధ్యాహ్నం తన గదిలోకి వెళ్లి ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

సమాచారం అందుకున్న దుండిగల్‌ పోలీసులు బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, వైష్ణవి ఉరి వేసుకున్న గదిలోనే గతేడాది మరో బాలిక ఇదే విధంగా ఆత్మహత్యకు పాల్పడటంపై మృతురాలి బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఇంటికి వచ్చినప్పుడు సంతోషంగా ఉందని, 8వ తేదీ మధ్యాహ్నం వరకు స్నేహితులతో ఆటలు ఆడిందని, ఇంతలోనే ఆత్మహత్య చేసుకోవడం వెనుక తమకు అనుమానాలు ఉన్నాయని అంటున్నారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా సమగ్ర దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు. 

Videos

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు