Breaking News

ఐసీఐసీఐ బ్యాంకులో గోల్‌మాల్‌

Published on Fri, 10/04/2024 - 05:37

చిలకలూరిపేట: పల్నాడు జిల్లా, చిలకలూరిపేట ఐసీఐసీఐ బ్యాంకు బ్రాంచ్‌లో కోట్లాది రూపాయల ఖాతాదారుల సొమ్ము గోల్‌మాల్‌ జరిగిన ఘటన సంచలనం సృష్టించింది. దీంతో బాధిత ఖాతాదా­రులు గురువారం బ్యాంకు వద్దకు చేరుకొని ఆందోళనకు దిగారు. స్థానిక బ్యాంకు బ్రాంచిలో కొన్నేళ్లుగా పలువురు ఫిక్స్‌డ్‌ (ఎఫ్‌డీ), రికరింగ్‌ డిపా­జిట్లు(ఆర్‌డీ) చేయడంతో పాటు గోల్డ్‌ లోన్లు తీసుకున్నారు. ఆర్డీకి సంబంధించి వడ్డీ తీసుకొనే వారు బ్యాంకుకు వచ్చిన సమయంలో వారి ఖాతాల్లో డబ్బు లేకపోవడంతో విషయం బయ­టకు పొక్కింది. 

దీంతో ఒక్కొక్కరుగా ఖాతాదా­రులు బ్యాంకుకు వచ్చి తమ డిపాజిట్ల విషయమై ప్రశ్నల వర్షం కురిపించారు. దీంతో బ్యాంకు సిబ్బంది ఖాతాలను పరిశీలించగా కోట్లాది రూపా­యల అవకతవకలు జరిగినట్లు గుర్తించి బ్యాంకు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. దీంతో బ్యాంకు జోనల్‌ మేనేజర్‌ సందీప్‌ మెహ్రా, రీజనల్‌ హెడ్‌ రమేశ్, ఇతర ఉన్నతా«ధికారులు బ్రాంచికి వచ్చి విచారణ చేపట్టారు. ఈ వ్యవహా­రంలో గతంలో బ్రాంచి మేనేజర్‌గా పనిచేసిన దూడ నరేశ్‌ చంద్రశేఖర్‌ హస్తం ఉందని అనుమాని­స్తున్నారు. 

డిపాజిట్లు రెన్యువల్‌ చేయకపోవడం, ఓవర్‌ డ్రాఫ్ట్‌లు తీసుకోవడం వంటి అవకతవకలకు పాల్పడినట్లు బ్యాంకు ఉన్నతాధికారుల విచార­ణలో వెలుగు చూసింది. ఈ వ్యవహారంలో ఇతర సిబ్బంది హస్తంపై కూడా విచారణ చేస్తున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో 14మంది బ్యాంకు ఖాతా­­దారులు పోలీసుస్టేషన్‌లో గురువారం ఫిర్యా­దు చేశారు. వారు తెలిపిన వివరాల మేరకు రూ.6.9­కోట్ల డిపాజిట్లు, 115 సవర్ల బంగారం గోల్‌మాల్‌ జరిగిందని చెప్పారు.  అంతేకాకుండా, మరో రూ.30 కోట్ల వరకు ఖాతాదారుల సొమ్ము పక్క­దారి పట్టినట్లు తెలుస్తోంది. 

కస్టమర్ల ప్రయోజనాలకు ప్రాధాన్యం
దీనిపై జోనల్‌ మేనేజర్‌ సందీప్‌ మెహ్రాను వివరణ కోరగా విచారణ జరుపుతున్నామని, అది పూర్తయ్యాక పోలీసులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. మరోవైపు ఐసీఐసీఐ బ్యాంక్ ప్రతినిధి మాట్లాడుతూ "ఐసీఐసీఐ బ్యాంక్‌లో  ఎల్లప్పుడూ కస్టమర్  ప్రయోజనాలకు అధిక ప్రాధాన్యత ఇస్తాం. బ్యాంకు శాఖలో అవకతవకలు జరిగినట్లు మా దృష్టికి రావటంతో సంబంధిత ఉద్యోగులను వెంటనే సస్పెండ్ చేశాం.  బ్యాంకులో మోసాల పట్ల మాకు జీరో టాలరెన్స్ పాలసీ ఉంది.  ఈ విషయంపై  సమగ్ర దర్యాప్తు చేస్తామని, కస్టమర్ల ఆర్థిక ప్రయోజనాలకు పూర్తిగా రక్షణ కల్పిస్తామని భరోసా ఇస్తున్నాం" అన్నారు

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)