Breaking News

హోలీ రోజు విషాదం.. వార్దా నదిలో గల్లంతైన యువకులు మృతి

Published on Mon, 03/25/2024 - 17:30

సాక్షి, కొమురంభీం జిల్లా: హోలీ పండుగ రోజు అసిఫాబాద్‌ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నదిలో స్నానికి వెళ్లి గల్లంతయిన యువకుల కథ విషాదంగా ముగిసింది. కౌటాల మండలం తాటిపల్లి సమీపంలోని వార్దా నదిలో ఈతకు వెళ్లిన నలుగురు యువకులు విగతజీవులుగా మారారు. మృతులను కౌటాల మండలం నదీమబాద్‌కు చెందిన కమలాకర్(22), సంతోష్(25), ప్రవీణ్(23), సాయి(22)గా గుర్తించారు.

కౌటాల మండలం నదిమాబాద్ గ్రామానికి చెందిన నలుగురు యువకులు సోమవారం సంతోషంగా హోలీ ఆడుకున్నారు. స్నేహితులపై రంగులు చల్లుకుంటూ.. సెల్పీలు దిగి హోలీ సంబురాలు జరుపుకున్నారు. అనంతరం స్నేహితులతో కలిసి స్నానం చేసేందుకు తాటిపల్లి వద్దనున్న వార్ధా నదికి వెళ్లారు. నీటిలో స్నానం చేస్తుండగా.. నలుగురు కొట్టుకుపోయారు.

గమనించిన స్థానికులు గాలింపు చర్యలు చేపట్టినప్పటికి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రిస్య్కూ టీం అక్కడికి చేరుకొని గజ ఈతగాళ్లతో గల్లంతైన యువకుల కోసం గాలింపు చర్యలు చెపట్టిన ఫలితం లభించలేదు. నలుగురు నీటిలో మునిగి మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాలను కౌటాల దవాఖానకు తరలించారు. పండుగ నాడుఒకే సారి నలుగురు స్నేహితులు మృతి చెందడంతో బాధితుల కుంటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి..

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)