Breaking News

విద్యుత్‌ షాక్‌కు నలుగురు యువకులు బలి

Published on Tue, 11/05/2024 - 05:34

ఉండ్రాజవరం: తూర్పు గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం తాడిపర్రు గ్రామంలో విద్యుత్‌ షాక్‌కు గురై నలుగురు యువకులు మృతిచెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... తాడిపర్రు గ్రామంలో  సర్దార్‌ పాపన్న గౌడ్‌ విగ్రహావిష్కరణపై స్థానికంగా రెండు సామాజికవర్గాల మధ్య 18 నెలలుగా వివాదం నెలకొంది. కలెక్టర్, ఆర్‌డీవో వంటి ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని ఇటీవల వివాదాన్ని పరిష్కరించారు. 

ఈ నేపథ్యంలో సోమవారం గౌడ సామాజికవర్గం వారు పాపన్న గౌడ్‌ విగ్రహావిష్కరణకు, అన్నసమారాధనకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఇందులో భాగంగా సోమవారం తెల్లవారుజామున కొందరు యువకులు 25 అడుగుల భారీ ఫ్లెక్సీ కడుతుండగా వారికి 11కేవీ విద్యుత్‌ వైరు తగిలింది. తీవ్ర విద్యుదాఘాతానికి గురై బొల్లా వీర్రాజు (25), కాసగాని కృష్ణ (23), పామర్తి నాగేంద్ర (25), మారిశెట్టి మణికంఠ (29) అక్కడికక్కడే మృతిచెందారు. కోమటి అనంతరావు అనే యువకుడికి తీవ్ర గాయాలు కాగా, మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. 

మృతిచెందినవారిలో కాసగాని కృష్ణకు పెళ్లి కాగా, మిగిలిన ముగ్గురు అవివాహితులు. తీవ్రంగా గాయపడిన కోమటి అనంతరావును తొలుత పశి్చమ గోదావరి జిల్లా తణుకు ప్రభుత్వాస్పత్రికి, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ యువకులు అందరూ కొబ్బరి ఒలుపు కారి్మకులుగా, వ్యవసాయ కూలీలుగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ ఘటనతో తాడిపర్రు గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)