Breaking News

ఒకే ఆస్పత్రిలో తండ్రి మరణం.. కొడుకు జననం

Published on Thu, 10/24/2024 - 04:13

రాజోళి: విధి ఆ కుటుంబంతో వింత నాటకమాడింది. భర్త చనిపో యాడని బాధపడాలో.. అతనికి ప్రతిరూపంగా జన్మించిన కొడుకు ను చూసి సంబరపడాలో తెలియని దయనీయస్థితి ఏర్పడింది ఆ తల్లి కి. జోగుళాంబ గద్వాల జిల్లా రాజో ళి మండలంలోని తుమ్మలపల్లె గ్రామానికి చెందిన శివ (28)కు ఏపీ లోని ఉమ్మడి కర్నూలు జిల్లా బల పాలపల్లి గ్రామానికి చెందిన లక్ష్మితో ఏడాది క్రితం వివాహమైంది. 

కాగా మంగళవారం శివ తుమ్మలపల్లె నుంచి రాజోళికి వెళ్తున్న క్ర మంలో బైక్‌ అదుపు తప్పి కిందపడగా తలకు తీవ్ర గాయమైంది. స్థానికులు వెంటనే అతడిని కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న శివ భార్య లక్ష్మితో పాటు కుటుంబసభ్యులు ఆస్పత్రికి చేరుకున్నారు. ఈ క్రమంలోనే చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున శివ మృతి చెందగా, తర్వాత గంట సమయంలోనే పురిటి నొప్పు లతో శివ భార్య అదే ఆస్పత్రిలో మగ బిడ్డకు జన్మనిచ్చింది.

ఒకవైపు భర్త చనిపోయాడనే బాధ.. మరోవైపు కొడుకు రూపంలో మళ్లీ జన్మించాడనే నమ్మకంతో ఆమె పడిన వేదన వర్ణనాతీతం. పుట్టిన బిడ్డను చూసుకునే భాగ్యం తండ్రికి లేదని, బిడ్డకు తండ్రిని చూపించే అదృష్టం తల్లికి లేకుండా పోయిందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.  

#

Tags : 1

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)