Breaking News

Hyderabad: భార్య చూస్తుండగా భర్త, ఇద్దరు కుమార్తెల దుర్మరణం

Published on Mon, 08/12/2024 - 05:11

మేడ్చల్‌: మేడ్చల్‌ మండలం గౌడవెల్లి రైల్వే స్టేషన్‌లో రైలు ఢీకొని తండ్రితో సహా ఇద్దరు పిల్లలు మృతి చెందారు. స్థానికులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్‌ జిల్లా మనోహరాబాద్‌ మండలం లింగారెడ్డిపేటకు చెందిన తోగరి కృష్ణ (42) తన భార్య కవిత (37), కుమార్తెలు వర్షిత (12), వరిణి (8)లతో కలిసి అత్వెల్లి పరిధిలోని రాఘ వేంద్రనగర్‌ కాలనీలో నివాసముంటున్నాడు. కృష్ణ రైల్వేలో ట్రాక్‌మన్‌గా పని చేస్తున్నాడు. నాలుగు రోజులుగా మేడ్చల్‌ –మనోహరాబాద్‌ రూట్లో ట్రాక్‌మెన్‌గా పని చేస్తున్నాడు. 

కాగా, ఆదివారం గౌడవెల్లి రైల్వే స్టేషన్‌లో కృష్ణకు డ్యూటీ ఉంది. తన స్వగ్రామం లింగారెడ్డిపేటలో బోనాల పండుగ ఉండటంతో తన భార్య, ఇద్దరు కుమార్తెలను వెంటబెట్టుకుని డ్యూటీ ముగిశాక లింగారెడ్డిపేట వెళ్దామని కారులో గౌడవెళ్లి స్టేషన్‌కు మధ్యాహ్నం 3గంటల సమయంలో చేరుకున్నారు. భార్య, పిల్లలను స్టేషన్‌లో టికెట్‌ బుకింగ్‌ కౌంటర్‌ వద్ద ప్లాట్‌ ఫాంపై కూర్చోబెట్టి కృష్ణ స్టేషన్‌ చివరిలో ట్రాక్‌పైకి పనిచేసేందుకు వెళ్లాడు. ఆయన అక్కడ పనిచేసుకుంటున్న సమయంలో చిన్న కూతురు వరిణి ట్రాక్‌పై దిగి తండ్రి వైపు వస్తోంది. 

ఈ క్రమంలోనే పెద్ద కూతురు, కవితకూడా ట్రాక్‌పై దిగి కృష్ణ పనిచేస్తున్నవైపు నడుస్తున్నారు. 3.45 గంటల ప్రాంతంలో నిజామాబాద్‌ నుంచి తిరుపతి వెళ్తున్న రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌ రైలు గౌడవెల్లి స్టేషన్‌కు చేరింది. అక్కడ స్టాప్‌ లేకపోవడంతో రైలు వేగంగా వస్తుండటం, కూతుళ్లు ట్రాక్‌పైన ఉన్న విషయం గమనించిన కృష్ణ కేకలు వేసుకుంటూ పిల్లల వైపు పరిగెత్తాడు. ప్రమాదాన్ని తప్పించుకునేందుకు పెద్ద కూతు రును పట్టుకుని ట్రాక్‌కు ప్లాట్‌ ఫాంకు మధ్యలో గోడవైపు నిలబడ్డాడు. అయితే అప్పటికే చిన్న కూతురును రైలు ఢీకొట్టింది. 

కవిత మరో ట్రాక్‌పైకి వెళ్లింది. ఈ క్రమంలో గోడ మధ్యలో ఇరుక్కుపోయిన తండ్రీకూతుళ్లను కూడా రైలు వేగంగా ఢీకొనడంతో ముగ్గురూ మృతి చెందారు. ట్రాక్‌పై వారి మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. నిమిషాల వ్యవధిలోనే దారుణం జరిగిపోయింది. కవితకు విషయం అర్థమయ్యేలోపే ముగ్గురూ అనంతలోకాలకు వెళ్లిపోయారు. స్టేషన్‌లో ఉన్న వారు కవిత చిరునామా తెలుసుకుని బంధువు లకు, అపార్ట్‌మెంట్‌ వాసులకు తెలియజేయడంతో వారు ఘటనా స్థలికి చేరుకున్నారు. పోలీసులు మృతదేహాలను మార్చురీకి తరలించి కేసు నమోదు చేసుకున్నారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)