Breaking News

విషాదం.. పాము కాటుతో తండ్రీకొడుకు మృతి

Published on Sun, 07/23/2023 - 09:21

రాజంపేట: పాము కాటు కారణంగా ఓ పేదింట విషాదం నెలకొంది. అర్ధరాత్రి పాము కాటుకి తండ్రీకొడుకులు బలయ్యారు. ఈ విషాదకర ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. వారి మృతితో భార్య అనాథగా అయిపోయింది. కుటుంబ సభ్యులు, స్థానికులు కన్నీటిపర్యంతమవువున్నారు. 

వివరాల ప్రకారం..  రాజంపేట మండలం శేర్‌ శంకర్‌ గ్రామ పంచాయతీ పరిధిలోని మూడు మామిళ్ల తండాకు చెందిన ముద్రిచ్చ రవి (40) తనకున్న ఎకరం భూమిలో వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. రవి తనభార్యతో కలసి రోజూలాగే శుక్రవారం సాయంత్రం వ్యవసాయ పనులు ముగించుకుని ఇంటికి వచ్చాడు. రాత్రి భార్యాపిల్లలతో కలసి భోజనం చేసిన అనంతరం అందరూ కలసి పడుకున్నారు.

అయితే, రాత్రి 11.30 గంటల సమయంలో నిద్రలోంచి లేచిన రవి తన చేతిపై నుంచి పాము వెళ్లినట్లు భార్య మంగినికి తెలిపాడు. దీంతో భార్యాభర్తలు దేవుని పేరు తలచుకుని ముడుపు కట్టారు. తర్వాత ఇంట్లో పామును గుర్తించిన రవి కర్రతో కొట్టి దానిని చంపాడు. ఇదిలా ఉండగా అర్ధరాత్రి 12 గంటల తర్వాత చిన్నకొడుకు వినోద్‌(11) ఛాతీలో నొప్పివస్తోందని చెప్పి.. అంతలోనే వాంతులు చేసుకున్నాడు. కొద్ది సేపటికే ప్రాణాలు కోల్పో యాడు.

అదే సమయంలో తనకు కళ్లు తిరుగుతున్నాయని రవి భార్య మంగినికి తెలిపాడు. దీంతో వారు పాము కాటుకు గురైనట్లు గ్రహించిన మంగిని చుట్టుపక్కల వారి సహాయంతో రవిని శనివారం తెల్లవారు జామున 2 గంటల సమయంలో అంబులెన్సులో కామారెడ్డి ఆస్పత్రికి తరలించింది. చికిత్స పొందుతూ తెల్లవారు జామున 4 గంటలకు రవి సైతం మరణించాడు. ఒకే రోజు తండ్రీ కొడుకుల మరణంతో తండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఇది కూడా చదవండి: రోడ్డు ప్రమాదంలో బీఆర్‌ఎస్‌ నేత, తనయుడి మృతి

Videos

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)