Breaking News

యువరైతును మింగిన వర్షాలు

Published on Sat, 09/07/2024 - 01:58

కురవి: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు సాగు చేసిన మిర్చి పంట కుళ్లిపోవడం.. చేసిన అప్పులు తీర్చేమార్గం లేక మనస్తాపానికి గురైన యువ రైతు భూక్య హత్తిరాం (33) పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మహబూబాబాద్‌ జిల్లా కురవి మండలం రాజోలు శివారు హరిదాసు తండా జీపీ పరిధిలోని హర్య తండాలో శుక్రవారం జరిగింది. హత్తిరాం తనకున్న రెండు ఎకరాలకు తోడు మరో ఎకరం భూమిని కౌలుకు తీసుకుని సాగు చేసుకుంటున్నాడు. గతేడాది మిర్చి సాగు చేయగా నల్లి రోగంతో పంట నాశనమైంది. అప్పుడు పంట కోసం రూ.6 లక్షల అప్పులు చేశాడు.

ఆ అప్పులు తీరలేదు. ఈ ఏడాది అదే పంటను నమ్ముకుని తిరిగి మిర్చి సాగు చేశాడు. ఇటీవల భారీ వర్షాలు కురవడంతో వేసిన మిరప తోట కుళ్లిపోయి పనికిరాకుండా పోయింది. దీంతో మనస్తాపానికి గురైన హత్తిరాం గురువారం తోట వద్ద  పురుగుల మందు తాగి ఇంటికి వచ్చాడు. అస్వస్థతకు గురైన హత్తిరాం కుటుంబ సభ్యులకు మందు తాగినట్లు చెప్పాడు. అప్పటికే పరిస్థితి విషమిస్తుండటంతో కుటుంబసభ్యులు వెంటనే మహబూబాబాద్‌లోని జనరల్‌ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందాడు. మృతుడి తండ్రి భూక్య స్వామి (సామ్య) ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు కురవి ఎస్సై గండ్రాతి సతీశ్‌ తెలిపారు. మృతుడికి భార్య మీనా, అరవింద్, అరుణ్‌ కుమారులున్నారు.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)