Breaking News

కూలిన కుటుంబం.. సూర్యాపేటలో విషాదం

Published on Thu, 08/03/2023 - 20:11

సాక్షి, సూర్యాపేట: తల్లిదండ్రులను చూసేందుకు ఇంటికి వచ్చిన కొడుకు.. ఆ తల్లిదండ్రులతో కలిసి కానరాని లోకాలకు వెళ్లిపోయాడు. ఆ ఇంటి గోడ కూలి మట్టిపెళ్లల కింద నలిగి ఆ కుటుంబం మొత్తం ప్రాణాలు కోల్పోయింది. సూర్యపేట జిల్లాలో ఈ విషాదం చోటు చేసుకుంది. 

నాగారం మండల కేంద్రంలో శీలం రాములు తన భార్య రాములమ్మ, కొడుకు శ్రీనివాస్‌(35)తో ఉంటున్నాడు. అయితే కుటుంబానికి ఆర్థికంగా ఆసరాగా ఉండేందుకు శ్రీను హైదరాబాద్‌కు వెళ్లి కూలీ పనులు చేసుకుంటున్నాడు. ఈ క్రమంలో తల్లిదండ్రుల్ని చూసేందుకు ఇంటికి వచ్చాడు. బుధవారం రాత్రి భారీగా గాలి దుమారం వీచింది.  అప్పటికే ఆ ఇంటి మట్టి గోడలు వర్షాలకు నానిపోయి ఉండడంతో.. అవి కుప్పకూలి ఆ ముగ్గురి మీద పడినట్లున్నాయి.

గురువారం ఉదయం విద్యుత్ శాఖ ఉద్యోగి కరెంట్ బిల్లు ఇచ్చేందుకు వెళ్లే వరకు ఆ ఇల్లు కూలిన విషయాన్ని ఎవరూ గమనించకపోవడం గమనార్హం. దీంతో.. ఆ ఉద్యోగి స్థానికులను అప్రమత్తం చేశాడు. అయితే అప్పటికే మట్టిపెళ్లల కింద చిక్కుకుని రాములు, రాములమ్మ, శ్రీను ప్రాణం విడిచారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాలను ట్రాక్టర్‌లో స్థానిక ఆసుపత్రికి తరలించారు. నిద్రలోనే ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)