Breaking News

గోల్డ్‌లోన్‌ కంపెనీలో రూ.8 కోట్లు స్వాహా

Published on Mon, 01/27/2025 - 05:20

పుంగనూరు: ఓ గోల్డ్‌లోన్‌ కంపెనీలో సిబ్బందే తమ సన్నిహితులు, బంధువులతో నకిలీ బంగారు తాకట్టు పెట్టించి రూ.8 కోట్లు కొల్లగొట్టారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా పుంగనూరు, పలమనేరు­లో ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విజయవాడ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహి­స్తున్న ‘కనకదుర్గ గోల్డ్‌లోన్స్‌ కంపెనీ’ పుంగనూరు, పలమనేరుల్లో బ్రాంచ్‌ నిర్వహిస్తోంది. బంగారు తాకట్టు పెట్టుకొని.. గ్రాముకు మార్కెట్‌ ధరకు అనుగుణంగా 70 నుంచి 80 శాతం వరకు రుణం ఇస్తోంది. సంస్థలోని ఆరుగురు ఉద్యోగులు సుల­భంగా డబ్బులు సంపాదించేందుకు పక్క­దారి పట్టా­రు.

తమ సన్నిహితులు, బంధువుల్లో 20 మందిని ఎంపిక చేసుకున్నారు. వారి ద్వారా నకిలీ బంగారు నగలు తాకట్టు పెట్టించి.. డబ్బులు ఇస్తుండేవారు. కంపెనీ యాజ­మా­న్యం డిసెంబర్‌లో నిర్వహించిన ఆడిట్‌లో నకిలీ బంగారు నగలుతో రూ.కోట్లు స్వాహా చేసినట్లు గుర్తించింది. దీనిపై వెంటనే అంతర్గత విచారణ చేపట్టింది.

తమ కంపెనీకే చెందిన ఆరుగురు ఉద్యోగులు.. మరో 20 మందితో కలసి సుమారు 6 కిలోలకు పైగా నకిలీ బంగారు నగలతో రూ.8 కోట్లు (పుంగనూరులో రూ.5 కోట్లు, పలమనేరులో రూ.3 కోట్లు) స్వాహా చేసినట్లు తేల్చింది. వారందరిపైనా యాజమా­న్యం గురువారం పోలీసులకు ఫిర్యా­దు చేసింది. ఈ వ్యవహారం బయట­పడటంతో బంగారం తాకట్టు పెట్టిన పట్టణ ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)