Breaking News

గచ్చిబౌలిలో దారుణం.. ప్రేమోన్మాది దాడిలో యువతి మృతి

Published on Thu, 08/29/2024 - 09:14

సాక్షి, హైదరాబాద్‌: నగరంలోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో గోపన్‌పల్లి తండాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రియురాలిపై ప్రేమోన్మాది దాడి ఘటనలో యువతి మృతిచెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు.

వివరాల ప్రకారం.. పశ్చిమ బెంగాల్‌కు చెందిన దీపన తమాంగ్‌(25) నల్లగండ్లలో బ్యూటీషియన్‌గా పనిచేస్తోంది. తన స్నేహితులతో కలిసి గచ్చిబౌలిలోని గోపన్‌పల్లి తండా సమీపంలో నివాసం ఉంటుంది. ఇక, కర్ణాటకలోని బీదర్‌కు చెందిన రాకేష్‌ అనే యువకుడు కూడా అక్కడే ఉంటున్నాడు. అయితే, కొద్దిరోజులుగా రాకేష్‌.. దీపన వెంటపడుతూ తనను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకోవాలని వేధింపులకు గురిచేశాడు. రాకేష్‌ ప్రపోజల్‌ను ఆమె నిరాకరించడంతో దీపనపై కోపం పెంచుకున్నాడు.

ఈ క్రమంలో బుధవారం రాత్రి దీపన ఇంటికి వెళ్లిన రాకేష్‌.. ఆవేశంతో ఆమెపై కత్తితో దాడి చేశాడు. అక్కడే ఉన్న దీపన స్నేహితులు.. రాకేష్‌ను అడ్డుకోబోతుండగా వారిపైనా దాడికి పాల్పడ్డాడు. రాకేష్‌ దాడిలో దీపన మృతిచెందగా.. ముగ్గురు స్నేహితులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన తర్వాత రాకేష్‌ అక్కడి నుంచి పారిపోయాడు. మొయినాబాద్‌ సమీపంలో విద్యుత్‌ స్థంభం ఎక్కి కరెంట్‌ తీగలు పట్టుకుని రాకేష్‌ ఆత్మహత్యకు పాల్పడగా.. స్థానికులు గుర్తించి అతడిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ దారుణ ఘటనపై కసు నమోదు చేసుకున్న పోలసులు.. దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)