Breaking News

పోలీసులకు హ్యాకర్‌ వార్నింగ్‌.. పర్సనల్‌ డేటా బయటపెడతామంటూ..

Published on Sun, 10/15/2023 - 11:25

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో ఎన్నికల వేళ షాకింగ్‌ ఘటన చోటుచేసుకుంది. ఏకంగా పోలీసు ఉన్నతాధికారి ఫోన్‌ హ్యాకింగ్‌కు గురి కావడం కలకలం సృష్టించింది. అంతేకాకుండా రాబోయే రోజుల్లో మరికొందరు పోలీసుల ఫోన్లను కూడా హ్యాక్‌ చేసి సమాచారం బయటకు తీస్తామని హెచ్చరించడం చర్చనీయాంశంగా మారింది. 

వివరాల ప్రకారం.. తెలంగాణలో ఎన్నికల సమయం కావడంతో పోలీసు యంత్రాంగం నిత్యం తనిఖీలు, బందోబస్తు విధుల్లో నిమగ్నమై ఉంది. ఇలాంటి తరుణంలో సైబరాబాద్‌ పరిధిలోని ఒక డీసీపీ ఫోన్‌ హ్యాక్‌ అయ్యింది. శనివారం ఉదయం నుంచి విధి నిర్వహణలో నిమగ్నమైన ఆ డీసీపీ ఫోన్‌ మధ్యాహ్న సమయంలో అకస్మాత్తుగా హ్యాకింగ్‌కు గురైనట్టు గుర్తించారు. దాదాపు 2 గంటల సమయం ఫోన్‌ పూర్తిగా అవతలి వారి చేతిలోకి చేరినట్టు నిర్ధారించారు.

అతికష్టమ్మీద సైబర్‌ నిపుణులు డీసీపీ ఫోన్‌ను సాధారణ స్థితికి తీసుకొచ్చినట్లు సమాచారం. ఇది హ్యాకర్ల పనేనా?.. లేక ఎవరైనా గిట్టని వారు చేశారా? అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఒక డీసీపీ స్థాయి అధికారి ఫోన్‌ హ్యాక్‌ చేయటం.. పోలీసు అధికారులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. అయితే, నగరంలో ఒక ఐటీ ఉద్యోగిపై సదరు డీసీపీ చేయిచేసుకోవటం వల్లనే ఐటీ నిపుణులు ఫోన్‌ హ్యాక్‌ చేసి సమాచారం. ఫోన్‌లోని వ్యక్తిగత వీడియోలు బయటపెట్టినట్టు సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు.. రాబోయే రోజుల్లో మరికొందరి పోలీసుల సమాచారం కూడా ఇదే విధంగా వెలికితీస్తామంటూ తమ పోస్టు ద్వారా హెచ్చరించటం గమనార్హం. దీంతో, అప్రమత్తమైన పోలీసులు.. సదరు హ్యాకర్‌ కోసం గాలిస్తున్నారు. 

ఇది కూడా చదవండి: ప్రియుడు మోసం చేశాడనే ప్రవల్లిక ఆత్మహత్య

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)