Breaking News

మీషో కూపన్ల పేరిట సైబర్‌మోసం

Published on Mon, 05/27/2024 - 05:18

సాక్షి, హైదరాబాద్‌: ఆన్‌లైన్‌ షాపింగ్‌ వెబ్‌సైట్‌ అయిన మీషో పేరిట సైబర్‌ నేరగాళ్లు సరికొత్త మోసానికి తెర తీస్తున్నారని సైబర్‌ భద్రత నిపుణులు హెచ్చరిస్తున్నారు. మీషో కంపెనీ నుంచి వచి్చందని భ్రమపడేలా ఓ ఫామ్‌ను, స్క్రాచ్‌ కార్డును డిజైన్‌ చేసి సైబర్‌ నేరగాళ్లు పోస్ట్‌ చేస్తున్నారు. వీటిని అందుకున్న వారిని అందులోని కార్డును స్క్రాచ్‌ చేయాలని సూచనల్లో పేర్కొంటున్నారు. 

అలా స్క్రాచ్‌ చేసిన తర్వాత అందులో మీరు లక్కీ కస్టమర్‌ కింద లక్కీ కూపన్‌లో కారు, బంగారం వంటి ఖరీదైన బహుమతులు గెలుచుకున్నారని ఉంటుంది. ఇలా లక్కీ డ్రా తగిలిన వారు వెంటనే మీ స్క్రాచ్‌ కార్డుపై ఉన్న క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేసి, మేం అడిగే వివరాలు నమోదు చేయాలని చెబుతారు. ఏదైనా సందేహాలుంటే మీకు ఇచ్చిన దరఖాస్తులోని నంబర్లకు ఫోన్‌ చేయాలని సూచిస్తున్నారు. 
వివరాలిస్తే అసలుకే మోసం...

ఎవరైనా అమాయకులు ఈ ఉచ్చులో చిక్కితే ఇక సైబర్‌ నేరగాళ్లు తమ విశ్వరూపం చూపిస్తున్నా­రు. ఇలా స్క్రాచ్‌ కార్డుపై ఉన్న క్యూర్‌ కోడ్‌ స్కాన్‌ చేసి అందులో సూచించిన విధంగా వివరాలు నమోదు చేస్తే ఇక అసలు మోసం మొదలవుతుంది. క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేయగానే అనుమానాస్పద యాప్‌లు మనకు తెలియకుండానే మన ఫోన్‌లోకి ఇన్‌స్టాల్‌ అవుతాయి. అదేవిధంగా మనం నమోదు చేసే బ్యాంకుఖాతా, వ్యక్తిగత వివరాలన్నీ తీసుకుంటున్న సైబర్‌ నేరగాళ్లు బ్యాంకుఖాతాల్లోని డబ్బులు కొల్లగొడుతున్నారు.

ఇలాంటి కూపన్లు వస్తే నమ్మవద్దని, ఎలాంటి వివరాలు వారితో పంచుకోవద్దని సైబర్‌ భద్రత నిపుణులు హెచ్చరిస్తున్నారు. గతంలో పట్టణప్రాంతాలకే పరిమితమైన ఈ తరహా మోసాలు ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో కూడా జరుగుతున్నాయని సైబర్‌ భద్రత నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి మోసాల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వారు సూచించారు. 

Videos

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)