Breaking News

పర్సు ఇంట్లో మరిచిపోయా.. కాల్‌ చేస్తే స్విచాఫ్‌.. న్యాయవాదికే మస్కా కొట్టిన కేటుగాళ్లు

Published on Sat, 07/29/2023 - 11:05

జయపురం(భువనేశ్వర్‌): ‘సార్‌.. పర్స్‌ ఇంట్లో మరచిపోయాను. చికిత్స కోసం డబ్బు అవసరం. ఫోన్‌ పేలో పంపించగలరు. ఉదయం 11గంటలకు తిరిగి ఇస్తా’నని కొరాపుట్‌ జిల్లా బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు బీరేష్‌ పట్నాయక్‌కు ఓ సైబర్‌ నేరగాడి నుంచి ఫోన్‌ వచ్చింది. పరిచయస్తుని పేరు చెప్పడంతో అతను కూడా వివిధ దఫాలుగా రూ.30 వేలు జమ చేశారు. అయితే కొద్ది సేపటికే ఫోన్‌ స్విచాఫ్‌ రావడం, డబ్బు తిరిగి జమ కాకపోవవంతో మోసపోయానని గ్రహించిన న్యాయవాది జయపురం పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీనిపై బాధితుడి వివరణ ప్రకారం... మంగళవారం ఉదయం 7750874432 నంబర్‌ నుంచి ఫోను వచ్చింది. తనకు తెలిసిన వ్యక్తి దాస్‌ బాబుగా పేరు చెప్పి, ఆస్పత్రిలో ఉన్నానని.. చికిత్స కోసం డబ్బులు అవసరం కాగా, పర్స్‌ మర్చిపోయానని తెలిపాడు. రూ.10 వేలు అవసరం అయ్యాయని, ఇంటికి వచ్చి ఇస్తానని నమ్మబలికాడు. దీంతో అడిగినంత ఫోన్‌ పే చేశారు.

కొద్ది సేపటికే మరో రూ.10 వేలు అడగ్గా, మళ్లీ బదిలీ చేశారు. అనంతరం ఫోన్‌ చేసి ఫోన్‌ పేలో రూ.30 వేలు పంపానని నకిలీ రసీదు వాట్సాప్‌కు పంపించాడు. పారపాటున రూ.10 వేలు అధికంగా జమయ్యాయని, మిగతా మొత్తం ట్రాన్స్‌ఫర్‌ చేయాలని కోరడంతో తిరిగి జమ చేశారు. అయితే అకౌంట్‌లో చూడగా నగదు లేకపోవడం, సంబంధిత వ్యక్తి ఫోన్‌ స్విచాఫ్‌ రావడంతో మోసపోయానని గ్రహించిన అతను.. పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

చదవండి    వర్షం మధ్య దాహార్తి తీర్చుకుంటున్న పులి.. అలరిస్తున్న అరుదైన వీడియో!

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)