Breaking News

అమీర్‌పేట కంపెనీపై సైబర్ అటాక్: రూ.10 కోట్లు..

Published on Fri, 08/09/2024 - 17:59

టెక్నాలజీ విపరీతంగా పెరుగుతోంది. దీనినే అదనుగా తీసుకుని సైబర్ నేరగాళ్లు ప్రజలను మాత్రమే కాకుండా కొన్ని కంపెనీలను కూడా దోచేస్తున్నాయి. గతంలో ఇలాంటి ఘటనలు కోకొల్లలుగా జరిగినప్పటికీ.. ఇటీవల హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో మరో ఘటన వెలుగులోకి వచ్చింది.

హైదరాబాద్‌లోని అమీర్‌పేటకు చెందిన ఓ ఎక్స్‌పోర్ట్ కంపెనీ సైబర్‌ దాడికి గురైంది. నేరస్థులు ఏకంగా రూ. 10 కోట్లు కొట్టేయడానికి కంపెనీ ఈమెయిల్ సిస్టమ్‌ హ్యాక్ చేశారు. దుబాయ్ కంపెనీ నుంచి అమీర్‌పేట కంపెనీకి రూ. 10 కోట్లు రావాల్సి ఉంది. దీనికోసం సంస్థ దుబాయ్ కంపెనీకి మెయిల్ పంపింది.

దుబాయ్ సంస్థ చెల్లించాల్సిన మొత్తాన్ని చెల్లిస్తున్నట్లు మెయిల్ ద్వారా సమాచారం ఇచ్చింది. అయితే అందులో అమీర్‌పేట సంస్థకు చెందిన బ్యాంక్ అకౌంట్ కాకూండా.. సిడ్నీలో ఉన్న నేషనల్ బ్యాంక్ ఆఫ్ ఆస్ట్రేలియా బ్యాంకు అకౌంట్‍కు డబ్బు పంపాలని సైబర్ నేరగాళ్లు పంపిన మెయిల్‌లో ఉండటం గమనించి వెంటనే స్పందించారు.

వెంటనే గమనించిన అప్రమత్తమవ్వడంతో లావాదేవీలు జరగకుండా ఆపగలిగారు. ఈ సంఘటన జరిగిన తరువాత తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోకి అమీర్‌పేట కంపెనీ ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు సెక్షన్ 318, 319 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)