Breaking News

బ్యాగ్‌ల అడుగున దాచి..

Published on Sun, 09/03/2023 - 05:28

సాక్షి, హైదరాబాద్‌: శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంత­ర్జాతీయ విమానాశ్రయంలో భారీ మొత్తంలో కొకైన్‌ పట్టుబడింది. బహిరంగ మార్కెట్‌లో రూ.50 కోట్ల విలువ చేసే ఐదు కిలోల కొకైన్‌ను డీఆర్‌ఐ (డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌) అధికారులు శుక్రవారంస్వాధీనం చేసుకున్నారు. అత్యంత విశ్వసనీయ సమా­చారం మేరకు చేపట్టిన ఈ ఆపరేషన్‌లో ఓ ప్రయాణికుడి లగేజీ బ్యాగ్‌ల కింద దాచి ఉంచిన కొకైన్‌ను డీఆర్‌ఐ అధికారులు గుర్తించారు.

ఈ మేరకు డీఆర్‌ఐ అధికా­రులు శనివారం ఓ ప్రకటనలో వివరాలు వెల్లడించారు. లావోస్‌ నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన ఓ ప్రయాణికుడు లావోస్‌ నుంచి సింగపూర్‌ మీదుగా హైదరాబాద్‌కు శుక్రవారం చేరుకున్నాడు.

అతడు హైదరాబాద్‌ నుంచి తిరిగి ఢిల్లీకి వెళ్లాల్సి ఉండగా, పక్కా సమాచారం మేరకు అధికారులు అతడి లగేజీని తనిఖీ చేశారు. సూట్‌కేస్, నాలుగు మహిళా హ్యాండ్‌ బ్యాగ్‌ల అడుగు భాగంలో దాచి ఉంచిన కొకైన్‌ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. అందులో మొత్తం ఐదు కిలోల కొకైన్‌ ఉన్నట్టు గుర్తించారు.

ఆ ప్రయాణికుడిపై నార్కోటిక్‌ డ్రగ్స్‌ అండ్‌ సైకోట్రోపిక్‌ సబ్‌స్టాన్సెస్‌ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఆ ప్రయాణికుడిని అరెస్టు చేసి జ్యుడీషియల్‌ కస్టడీకి తరలించినట్టు అధికారులు పేర్కొన్నారు. ఈ డ్రగ్‌ సిండికేట్‌లోని మరికొందరు ముఠా సభ్యులను గుర్తించేందుకు దర్యాప్తు ముమ్మరం చేసినట్టు డీఆర్‌ఐ అధికారులు తెలిపారు.  

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)