Breaking News

విద్యార్థిని మృతిపై అనుమానాలు నివృత్తి చేయండి

Published on Fri, 09/27/2024 - 05:05

తాడికొండ: రాజధాని అమరావతి ప్రాంతంలో ఉన్న వీఐటీ–ఏపీ యూనివర్సిటీలో విద్యార్థిని సాయిశ్రేయ మృతిపై కుటుంబ సభ్యుల అనుమానాలను నివృత్తి చేయాలని విద్యార్థి నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు గురువారం సాయి శ్రేయ తల్లి మంజుల, కుటుంబ సభ్యులతో కలిసి యూనివర్సిటీ గేటు ఎదుట ఆందోళన చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి లోపలికి వెళ్లేందుకు యత్నించగా సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. 

సాయిశ్రేయ మృతికి కారణాలు తెలియజేయాలని రెండు రోజులుగా కోరుతున్నా వీసీని కలిసేందుకు తమకు అనుమ­తి ఇవ్వడం లేదని మంజుల ఆవేదన వ్యక్తంచేశారు. వీసీ వచ్చి సమాధానం చెప్పే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివారెడ్డి గేటు ఎదుట బైఠాయించారు. విట్‌ వద్ద గొడవ గురించి తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కు­మార్‌ వచ్చి మంజులను లోపలికి తీసుకువెళ్లేందుకు ప్రయత్నించగా, సెక్యూరిటీ అడ్డుకున్నారు.

దీంతో యూనివర్సిటీ యాజమాన్యంతో ఎమ్మెల్యే ఫోన్‌లో మాట్లాడి సాయి శ్రేయ తల్లి మంజుల, కుటుంబ సభ్యులను లోపలికి తీసుకువెళ్లి వీసీ, ఇతర అధికారులను కలిశారు. ఈ నెల 17న తన కుమార్తె చనిపోయిందని, దానికి కారణాలు చెప్పాలని కోరుతున్నా పట్టించుకోకుండా యాజమాన్యం తమను ఇబ్బంది పెట్టిన తీరును వివరిస్తూ మంజుల కన్నీటిపర్యమంతమయ్యారు. ‘విద్యార్థిని చనిపోతే మాకేం సంబంధం లేదని వదిలేస్తారా...? ఆ కుటుంబ సభ్యులను పిలిచి మాట్లాడి న్యాయం చేయాలి. లేకపోతే నేను సహించను..’ అని విట్‌ వీసీ, సిబ్బందిని ఎమ్మెల్యే హెచ్చరించారు.  

Videos

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

మా టైమ్ వచ్చాక కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే! మాస్ వార్నింగ్

సెక్యూరిటీ ఇస్తాం అని పిలిచి... లాఠీ ఛార్జ్ పై రాచమల్లు సంచలన కామెంట్స్

మంచు కొండల్లో మొదలైన విధ్వంసం.. రష్యాలో 7 తీవ్రతతో భూకంపం!

YS జగన్ విజువల్స్ @గన్నవరం ఎయిర్ పోర్ట్

తాడిపత్రిలో ఎన్నికల టెన్షన్.. YSRCP జాఫర్ ను కిడ్నాప్ చేసిన జేసీ వర్గీయులు

మైదుకూరు నామినేషన్ సెంటర్లో కి వెళ్ళి... దౌర్జన్యం చేసిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్

ZPTC, MPTC స్థానాలకు షెడ్యూల్

Photos

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)