Breaking News

‘గట్టు’ కోసం గొడ్డళ్లతో దాడి..

Published on Thu, 06/08/2023 - 02:56

అడ్డగూడూరు: యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం మానాయికుంటలో భూ వివాదం భగ్గుమంది. రెండెకరాల భూమి గట్టు పంచాయితీ సోదరుల మధ్య చిచ్చురేపడంతో ఒకరిపై ఒకరు గొడ్డళ్లతో దాడి చేసుకోగా నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

పోలీసుల కథనం ప్రకారం.. మానాయికుంటకు చెందిన మార్త బుచ్చయ్య, లచ్చమ్మ దంపతులకు వీరయ్య, సైదులు కుమారులు. గ్రామ శివారులో తల్లిదండ్రులకు చెందిన రెండెకరాల భూమిని సోదరులిద్దరూ చెరో ఎకరం పంచుకుని సాగుచేసుకుంటున్నారు. కొంతకాలంగా వీరి మధ్య గట్టు పంచాయితీ నడుస్తోంది. 

అరకతో అచ్చుతోలుతుండగా.. 
వీరయ్య తన కుమారుడు ప్రభాస్‌తో కలసి బుధవారం ఉద యం పొలంలో అరకతో అచ్చుతోలుతున్నాడు. విషయం తెలుసుకున్న చిన్నకుమారుడు సైదులు, తన కు మారుడు శేఖర్‌తో కలసి భూమి వ ద్దకు వెళ్లి వీరయ్యతో వాగ్వాదానికి దిగాడు.

ఈ క్రమంలో నలుగురి మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరుగుతుండగా సైదులు కుమారుడు శేఖర్‌ గొడ్డలితో పెదనాన్న కుమారుడు ప్రభాస్‌పై దాడి చేశాడు. దీంతో ఒకరిపై మరొకరు దాడి చేసుకోవడంతో సైదులు ఎడమచెయ్యి తెగిపోవడంతో పాటు ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానిక రైతులు దాడిని అడ్డుకున్నారు. క్షతగాత్రులకు  ప్రాథమిక చికిత్స చేయించిన తర్వాత హైదరాబాద్‌కు తీసుకెళ్లారు.  

Videos

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)