Breaking News

చిలకలూరిపేట ఐసీఐసీఐలో సీఐడీ విచారణ

Published on Fri, 10/11/2024 - 04:18

చిలకలూరిపేట: ఐసీఐసీఐ బ్యాంకు చిలకలూరిపేట బ్రాంచ్‌లో జరిగిన కుంభకోణం విషయంలో సీఐడీ అధికారులు విచారణ చేపట్టారు. సీఐడీ ఏఎస్పీ సీహెచ్‌ ఆదినారాయణ ఆధ్వర్యంలో సీఐడీ అధికారుల బృందం గురువారం పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఐసీఐసీఐ బ్యాంకు బ్రాంచ్‌కి చేరుకుని విస్తృతంగా విచారణ చేపట్టారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు బ్యాంకు తలుపులు మూసివేసి ఎవరినీ లోనికి అనుమతించకుండా విచారణ కొనసాగించారు. 

ఈ సందర్బంగా సీఐడీ ఏఎస్పీ సీహెచ్‌ ఆదినారాయణ మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 8న సీఐడీ  ప్రధాన కార్యాలయంలో సంబంధిత విషయమై కేసు నమోదు చేసి విచారణ నిమిత్తం కేసు­ను గుంటూరు సీఐడీ కార్యా­ల­యానికి బదిలీ చేసినట్టు తెలి­పా­రు. తమ విచారణలో ఇప్ప­టి వరకు 72 మంది ఖాతాదారులకు సంబంధించి రూ. 28 కోట్లు గోల్‌­మాల్‌ జరిగినట్టు గుర్తించినట్లు తెలిపారు. 2021 నుంచి ఇక్కడ బ్రాంచి మేనేజర్‌గా పనిచేసిన దూడ నరేష్‌చంద్రశేఖర్, మరో ఇద్దరు కలిసి ఈ కుంభకో­ణానికి పాల్పడినట్టు తమ ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. 

ఇక్కడ పనిచేసిన అనంతరం నరేష్‌చంద్ర­శేఖర్‌ నరసరావుపేట, విజయవాడ భారతీనగర్‌ బ్రాంచ్‌­లలో మేనేజర్‌గా పనిచేసినట్టు తెలిపారు. విజయ­వాడలో పనిచేస్తున్న సమయంలో అతని అవకతవకలు వెలుగు చూసి ఈ ఏడాది జూలైలో బ్యాంకు అతనిని విధుల నుంచి సస్పెండ్‌ చేసింద­న్నారు. ఈ నెల చిలకలూరిపేట బ్రాంచిలో జరిగిన అక్రమాలు వెలుగు చూడటంతో సీఐడీ కేసు నమోదు చేసిందన్నారు.  

ఇంకా ఎవరైనా బ్యాంకు సిబ్బంది ఈ వ్యవ­హారంలో ఉన్నారా లేరా అనేది విచారణలో తేలాల్సి ఉందని తెలిపారు. వారం, పది రోజుల్లో విచారణ ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉందని, కేసు విషయమై ఇంకా ఎవరినీ అదుపులోకి తీసుకో­లేద­న్నారు.  సీఐడీ సీఐ సంజీవ్‌కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.

	ఐసీఐసీఐ బ్యాంకులో భారీ స్కామ్.. సీఐడీ విచారణ

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)