Breaking News

‘మార్గదర్శి’ కేసులో ఏ–2 శైలజ విచారణ నేడు

Published on Thu, 04/06/2023 - 06:25

సాక్షి, అమరావతి: మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ అక్రమ వ్యవహారాల కేసులో ఏ–2గా ఉన్న ఆ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ చెరుకూరి శైలజ కిరణ్‌ను సీఐడీ అధికారులు గురువారం విచారించనున్నారు. కేంద్ర చిట్‌ఫండ్‌ చట్టం–­1982కు విరుద్ధంగా చందాదారుల సొమ్మును మ్యూచువల్‌ఫండ్స్, షేర్‌ మార్కెట్లో పెట్టు­బడిగా పెట్టడం, రిజర్వ్‌ బ్యాంకు నిబంధన­లకు విరుద్ధంగా అక్రమ డిపాజిట్ల సేకరణపై సీఐడీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.

ఇప్పటికే ఈ కేసులో ఏ–3గా ఉన్న కొందరు మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ బ్రాంచి మేనే­జర్లను సీఐడీ విభాగం అరెస్ట్‌ చేసింది. కాగా ఈ కేసులో ప్రధాన నిందితుడు, ఏ–1గా ఉన్న చెరుకూరి రామోజీరావును సీఐడీ అధికారులు సోమవారం విచారించారు. నిధుల మళ్లింపు వాస్తవమేనని ఆయన అంగీకరించడం ప్రాధా­న్యం సంతరించుకుంది.

పైగా అది తమ సంస్థ ఇష్టమని.. అసలు విచారించడానికి సీఐడీకి ఏం అధికారం ఉందన్న రీతిలో రామోజీరావు ప్రవ­ర్తించడం అందర్నీ విస్మయపరచింది. కానీ సీఐడీ అధికారులు నిబంధనల మేరకు ఆయనను విచారించి కీలక విషయాలు రాబ­ట్టారు. ఏ–1గా ఉన్న రామోజీరావే నిధుల మళ్లింపు నిజమేనని దాదాపుగా అంగీకరించ­డంతో ఈ కేసులో సీఐడీ కీలక పురోగతి సాధించినట్లయింది.

ఈ నేపథ్యంలోనే ఈ కేసులో ఏ–2గా ఉన్న చెరుకూరి శైలజ కిరణ్‌ను గురు­వారం విచారించనుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. శైలజను హైదరాబాద్‌ జూబ్లీ­హిల్స్‌­లోని ఆమె నివాసంలోనే విచారించను­న్నారు. రామోజీరావు, శైలజ స్టేట్‌మెంట్లను విశ్లేషించిన అనంతరం ఈ కేసులో తదుపరి చర్యలకు ఉపక్రమించాలని సీఐడీ భావిస్తోంది. వారిద్దరినీ ఆంధ్రప్రదేశ్‌కు పిలిపించి మరీ విచారించేందుకు సీఐడీ సంసిద్ధమవుతుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.   

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)