Breaking News

పడగ విప్పిన గన్‌ కల్చర్‌.. తొమ్మిది మంది మృతి!

Published on Tue, 06/20/2023 - 07:22

అగ్రరాజ్యంలో మరోసారి గన్‌ కల్చర్‌ కోరలు చాచింది.  ఫాదర్స్‌ డే వీకెండ్‌ సందర్భంలో చికాగో ప్రజలు ఓవైపు సంబురాలు మునిగిపోగా.. మరోవైపు కాల్పుల ఘటనలు తొమ్మిది మంది ప్రాణాల్ని బలిగొన్నాయి. దాదాపు 50 మందికిపైగా గాయపడ్డారు. ఈ హింస అత్యంత విషాదకరమని వైట్‌హౌస్ ఓ ప్రకటనలో సంతాపం తెలిపింది.

శనివారం రాత్రి నుంచి ఆదివారం వరకు సబర్బన్ చికాగో, వాషింగ్టన్ స్టేట్, సెంట్రల్ పెన్సిల్వేనియా, సెయింట్ లూయిస్, సదర్న్ కాలిఫోర్నియా, బాల్టిమోర్ ప్రాంతాల్లో వేర్వేరు కాల్పుల ఘటనలు చోటు చేసుకున్నాయి. 

► సౌత్‌వెస్ట్ చికాగోకు 20 మైళ్ల దూరంలో ఇల్లినాయీస్ రాష్ట్రం లోని విలోబ్రూక్‌లో ఆదివారం ఉదయం ఓ భవన పార్కింగ్ ప్రదేశంలో జూన్ టీన్త్ వేడుకల్లో జరిగిన కాల్పుల్లో ఒకరు మృతి చెందగా, 23 మంది గాయపడ్డారు.

► ఇక శనివారం వాషింగ్టన్ స్టేట్ క్యాంప్ గ్రౌండ్‌లో ఆగంతకుడు యాధృచ్ఛికంగా కాల్పులు జరపడంతో ఇద్దరు చనిపోయారు. మరో ఇద్దరు గాయపడ్డారు. 

► కాలిఫోర్నియా లోని కార్సన్‌లో ఓ ఇంటివద్ద పూల్ పార్టీ జరుగుతుండగా కాల్పులు సంభవించి ఎనిమిది మంది గాయపడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందినట్లు సమాచారం అందుతోంది.  బాధితులంతా 16 నుంచి 24 ఏళ్ల లోపు వాళ్లే.

► జార్జి నగరంలో జరిగిన కాల్పుల్లో ఇద్దరు మృతి చెందారు. ముగ్గురు గాయపడ్డారు.

► పెన్సిల్వేనియా లోని వాకర్ టౌన్‌షిప్‌లో ఓ వ్యక్తి జరిపిన కాల్పుల్లో ప్రభుత్వ సైనికుడు మృతి చెందగా, మరొకరు గాయపడ్డారు. ఈ సంఘటనలో నిందితుడు తన ట్రక్కుని డ్రైవ్ చేసుకుంటూ లూయిస్‌టౌన్ బారక్స్ వైపు రాత్రి 11 గంటల సమయంలో దూసుకు వచ్చి అక్కడ ఉన్నవారిపై కాల్పులు జరిపి పారిపోయాడు.

► బాల్టిమోర్‌లో జరిగిన కాల్పుల్లో ఆరుగురు గాయపడ్డారు.

ఆయా ఘటనలపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన అమెరికా అధ్యక్ష భవనం.. తుపాకీ సంస్కృతి కట్టడికి ఇకనైనా ముగింపు పలకాలని ఆశిస్తున్నట్లు ఒక ప్రకటన విడుదల చేసింది. అదే సమయంలో ఘటనలపై దర్యాప్తులు కొనసాగుతున్నాయని ఆయా రాష్ట్ర గవర్నర్లు, పోలీస్‌ ఉన్నతాధికారులు చెబుతున్నారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)