Breaking News

రాజస్తాన్‌లో కిడ్నాప్‌.. హరియాణాలో హత్య

Published on Sat, 02/18/2023 - 05:44

జైపూర్‌: హరియాణాలో అత్యంత దారుణమైన ఘటన జరిగింది. గో సంరక్షకులుగా అనుమానిస్తున్న కొందరు రాజస్తాన్‌కు చెందిన ఇద్దరు ముస్లింలను కిడ్నాప్‌ చేసి తీసుకువెళ్లినట్టు ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత వారిద్దరి కాలిన మృతదేహాలు ఒక కారులో లభించడం కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించిన అరడజను మందికిపైగా బజరంగ్‌ దళ్‌ కార్యకర్తల్ని రాజస్తాన్‌ పోలీసులు అదుపులోనికి తీసుకొని విచారిస్తున్నారు. ఈ హత్యలను రాజస్తాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌ ఖండించారు. ఈ దారుణానికి పాల్పడిన వారిపై కఠినచర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

రాజస్తాన్‌లోని భరత్‌పూర్‌ జిల్లా ఘట్‌మీక గ్రామానికి చెందిన నజీర్‌ (25), జునైద్‌ అలియాస్‌ జునా (35)లను బుధవారం గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్‌ చేశారు. గురువారం వారిద్దరి మృతదేహాలు హరియాణాలోని భివానిలో లోహారు ప్రాంతంలో ఒక దగ్ధమైన కారులో కనిపించాయి. బజరంగ్‌ దళ్‌ కార్యకర్తలు ఆ ఇద్దరు ముస్లిం యువకుల్ని కిడ్నాప్‌ చేశారని వారి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. వారి ఫిర్యాదు మేరకు అరడజనుకుపైగా బజరంగ్‌దళ్‌ కార్యకర్తల్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ‘‘వారికి ఈ నేరంలో ప్రమేయం ఉందో లేదో తేలాల్సి ఉంది’’ అని పోలీసు ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ గౌరవ్‌ శ్రీవాస్తవ చెప్పారు. మృతి చెందిన వారిలో జునైద్‌కి నేరచరిత్ర ఉందని, ఐదుకి పైగా కేసుల్లో అతను నిందితుడని చెప్పారు. రింకూ సైనీ అనే నిందితుడిని అరెస్టు చేశామన్నారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)