Breaking News

సోదరుడే కాలయముడై..

Published on Thu, 01/25/2024 - 05:56

మైసూరు: ఇతర మతానికి చెందిన యువకుడిని ప్రేమించిందనే కోపంతో చెల్లిని సొంత అన్న చెరువులోకి తోసేయగా.. ఆమెను కాపాడేందుకు ప్రయత్నించిన తల్లి కూడా జలసమాధి అయ్యింది. ఈ దారుణం మైసూరు జిల్లా హుణసూరు తాలూకా మరూరు గ్రామంలో జరిగింది. వివరాలు.. మరూరుకు చెందిన సతీశ్, అనిత(43) దంపతుల కుమారుడు నితిన్‌ కూలి పనులకు వెళ్తుండగా.. ధను శ్రీ(18) బీకాం రెండో సంవత్సరం చదువుతోంది.

ఈక్రమంలో మారూరుకు పొరుగున ఉన్న హనగోడు గ్రామానికి చెందిన ఇతర మతస్తుడైన యువకుడిని ధనుశ్రీ ప్రేమిస్తోంది. ఈ విషయం తెలిసిన నితిన్‌ తరుచూ ధనుశ్రీతో గొడవ పడేవాడు. మంగళవారం సాయంత్రం బంధువులకు బాగా లేదంటూ నితిన్‌ బైక్‌పై తన సోదరి ధనుశ్రీని, తల్లి అనితను బయటకు తీసుకెళ్లాడు. ఊరి బయట ఉన్న చెరువు వద్ద ధనుశ్రీ ప్రేమ విషయమై వారి మధ్య గొడవ జరిగింది.

ఇంతలో పట్టరాని కోపంతో నితిన్‌ తన చెల్లి చేతులను టవల్‌తో కట్టేసి చెరువులోకి తోసేశాడు. ఆ వెంటనే కుమార్తెను కాపాడుకునేందుకు తల్లి అనిత కూడా చెరువులోకి దూకింది. దీంతో తల్లిని రక్షించేందుకు నితిన్‌ నీటిలోకి దూకాడు. కానీ తల్లీకూతురు నీళ్లలో మునిగి మరణించారు. ఆ తర్వాత నితిన్‌ ఇంటికి వచ్చి తండ్రి సతీశ్‌కు ఈ విషయం తెలియజేశాడు. బుధవారం ఉదయాన్నే గ్రామస్తులు, ఫైర్‌ సిబ్బంది చెరువులో గాలించి అనిత, ధనుశ్రీ మృతదేహాలను బయటకు తీశారు. హుణసూరు రూరల్‌ పోలీసులు నితిన్‌ను అరెస్టు చేసి కేసు నమోదు చేశారు.

#

Tags : 1

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)