Breaking News

తల్లి కొట్టిందని బాలుడి ఆత్మహత్య

Published on Sat, 07/15/2023 - 01:35

కోనరావుపేట (వేములవాడ): ‘‘ఊర్లో బతుకబుద్ధి అవు తలే. వేరేవాళ్లు చెప్పే మాటలకు బాధనిపిస్తోంది. అమ్మా.. నన్ను కొట్టినందుకు బాధలేదు. చెల్లిని మంచిగా చూసుకో. ఈ పేదబతుకు నాకొద్దు. చెల్లెకు మంచిగా పెళ్లి చేయండి. అమ్మా.. అన్నా.. బావా.. డాడీ.. నేను వెళ్తున్నా..’’అని ఓ బాలుడు స్నేహితుడికి సెల్ఫీ వీడియో పంపి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండ లంలోని కమ్మరిపేటతండాలో ఈ ఘటన జరిగింది.

కమ్మ రిపేటతండా (వట్టిమల్ల)కు చెందిన భూక్యా రాజు, జ్యోతి దంపతులకు దినేశ్, దీప్తి అనే పిల్లలు ఉన్నారు. దినేశ్‌ (17) గతేడాది వరకు కోనరావుపేట మండలంలోని ధర్మా రం హాస్టల్‌లో ఉంటూ ఎనిమిదో తరగతి వరకు చదువుకు న్నాడు. ఈ ఏడాది చదువు ఆపేసి ఇంటి వద్దనే ఉంటున్నాడు.

రెండు రోజుల క్రితం ఓ దుకాణంలో సిగరెట్‌ ప్యాకెట్‌ దొంగిలించాడని దుకాణం యజమా ని దినేశ్‌ తల్లిదండ్రులకు చెప్పగా.. తల్లి కోపంతో దినేశ్‌ను కొట్టింది. దీంతో గురువారం ఉదయం 10 గంటలకు దినేశ్‌ ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. స్నేహితుల దగ్గరికి వెళ్లాడని భావించిన తల్లిదండ్రులు వరినాట్లు వేసేందుకు పొలానికి వెళ్లారు. 

ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన వీడియో..
గురువారం ఉదయం ఇంట్లో నుంచి వెళ్లిన దినేశ్, తాను చనిపోతున్నానంటూ సెల్ఫీ వీడియో తీసి స్నేహితునికి పంపాడు. అయితే అతను పాఠశాలకు వెళ్లిపోగా.. సెల్‌ఫోన్‌ను అతని తండ్రి తీసుకెళ్లాడు. రాత్రి పది గంటలకు స్నేహితుడి తండ్రి ఇంటికొచ్చాక వీడియో చూసి వెంటనే దినేశ్‌ తల్లిదండ్రులకు చెప్పాడు.

అందరూ కలసి దినేశ్‌ కోసం అటవీ ప్రాంతంలో గాలించారు. శుక్రవారం తెల్లవారుజామున 3 గంటలకు వట్టిమల్ల శివారు అటవీ ప్రాంతంలో దినేశ్‌ మృతదేహం చెట్టుకు వేలాడుతూ కనిపించింది. కోనరావుపేట ఎస్సై రమాకాంత్‌ ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. తమ కుమారుని మృతికి దుకాణం యజమాని మాలోత్‌ కాంతి కారణమని మృతుని తండ్రి రాజు ఫిర్యాదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)