Breaking News

జనం రోడ్డెక్కనిదే స్పందించరా?

Published on Fri, 08/23/2024 - 04:47

ముంబై: మహారాష్ట్రలో థానే జిల్లాలోని బద్లాపూర్‌ పాఠశాలలో బాలికలపై లైంగిక వేధింపులు దిగ్భ్రాంతికరమని బాంబే హైకోర్టు ఆవేదన వెలిబుచ్చింది. దారుణం జరిగిన నాలుగైదు రోజులకు ప్రజలు మూకుమ్మడిగా ఆందోళనకు దిగితే గానీ పోలీసులు స్పందించలేదంటూ మండిపడింది. ‘‘పసిబిడ్డలపై అఘాయిత్యం జరిగితే తేలిగ్గా తీసుకోవడమేమిటి? జనం ఆగ్రహంతో వీధుల్లోకి వస్తే తప్ప ప్రభుత్వ యంత్రాంగం ముందుకు కదలదా? అంటూ ఆగ్రహించింది.

ఈ కేసులో బద్లాపూర్‌ పోలీసుల దర్యాప్తు సక్రమంగా లేదంటూ ఆక్షేపించింది. ‘‘బాధితులు ఫిర్యాదు చేశారు గనుక ఈ వ్యవహారం బయటకొచి్చంది. బయటకు రాని కేసులు ఎన్నో ఉండొచ్చు’’ అని అభిప్రాయపడింది. ‘‘పోలీసు వ్యవస్థ, న్యాయ వ్యవస్థ పట్ల ప్రజలు విశ్వాసం కోల్పోయే పరిస్థితి రాకూడదు. వారు న్యాయం కోసం రోడ్డెక్కి ఆందోళనలు చేసే పరిస్థితి ఉండకూడదు’’ అని పేర్కొంది.

‘‘పిల్లలకు స్కూళ్లలో కూడా భద్రత లేకపోతే ఏం చేయాలి? ఇక విద్యా హక్కు చట్టానికి అర్థమేమిటి?’’ అంటూ నిలదీసింది. ఎఫ్‌ఐఆర్‌ నమోదులో ఎందుకు జాప్యం జరిగిందని పోలీసులను ప్రశ్నించింది. ‘‘బాలికల భద్రతపై రాజీపడడానికి వీల్లేదు. వేధింపుల గురించి తెలిసినా పోలీసులకు ఫిర్యాదు చేయని స్కూలు యాజమాన్యంపై చర్యలు తీసుకోండి’’ అని ఆదేశించింది. 

27లోగా నివేదిక సమర్పించండి
బద్లాపూర్‌ పాఠశాలలో నాలుగేళ్ల వయసున్న ఇద్దరు బాలికలపై జరిగిన అఘాయిత్యం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడం తెలిసిందే. స్కూల్‌ వాష్‌ రూమ్‌లో అటెండర్‌ వారిని లైంగికంగా వేధించినట్లు వెల్లడైంది. ఈ నెల 12, 13న దారుణం జరిగితే పోలీసులు 16న ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. 17న నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై జస్టిస్‌ రేవతి మొహితే, జస్టిస్‌ పృథ్వీరాజ్‌ చవాన్‌తో కూడిన బాంబే హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ గురువారం సుమోటోగా విచారణ చేపట్టింది. బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని గుర్తుచేసింది. బాలికలకు, వారి కుటుంబాలకు అండగా నిలవాలని, మరింత బాధకు గురిచేయొద్దని ఆదేశించింది. ఈ కేసులో 27వ తేదీలోగా నివేదిక సమర్పించాలని ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఆదేశించింది.

Videos

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు