Breaking News

బండి సంజయ్‌ అరెస్టు

Published on Wed, 04/05/2023 - 02:21

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌ / కరీంనగర్‌క్రైం: కరీంనగర్‌లో మంగళవారం హైడ్రామా చోటు చేసుకుంది. అర్ధరాత్రి 12 గంటలు దాటిన తర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ ఇంటికి పెద్ద సంఖ్యలో చేరుకున్న నగర పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారు. ఈ క్రమంలో పార్టీ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య భారీ తోపులాట జరిగి ఉద్రిక్తతకు దారి తీసింది. టెన్త్‌ పేపర్ల లీకేజీకి సంబంధించి సంజయ్‌ను అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. కాగా సంజయ్‌ను హైదరాబాద్‌ వైపు తీసుకెళ్లారు. వివరాలు ఇలా ఉన్నాయి.

కరీంనగర్‌ అదనపు డీసీపీ చంద్రమోహన్‌ ఆధ్వర్యంలో ఏసీపీలు తుల శ్రీనివాసరావు, కరుణాకర్‌రావు , సీఐలు నటేష్, లక్ష్మీబాబు, దామోదర్‌రెడ్డి దాదాపు 50 మందికి పైగా పోలీసులు అర్ధరాత్రి సమయంలో బండి సంజయ్‌ ఇంటి వద్దకు చేరుకున్నారు. మిమ్మల్ని అరెస్టు చేస్తున్నామని సహకరించాలని కోరారు. తన అరెస్టుకు కారణంగా చూపించాలని, తనకు వారెంటు చూపాలంటూ పోలీసులతో సంజయ్‌ వాగ్వాదానికి దిగారు. మరో వైపు బండి సంజయ్‌పే అరెస్టు చేస్తున్నారనే ప్రచారంతో బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు.

పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండడంతో సంజయ్‌ను పోలీసులు ఇంటి నుండి బలవంతంగా బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. పోలీసుల ప్రయత్నాన్ని కార్యకర్తలు ప్రతిఘటించారు. పోలీసుల జులుం నశించాలని నినాదాలు చేస్తూ ఆయన అరెస్టును అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులకు, కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు బలవంతంగా సంజయ్‌ను వాహనంలో ఎక్కించి అక్కడి నుంచి తరలించారు.

ఎక్కడికి తీసుకెళ్తున్నారో చెప్పాలంటూ కార్యకర్తలు, అనుచరులు కోరినా పట్టించుకోకుండా అరెస్టు చేసి తీçసుకెళ్ళారు. తిమ్మాపూర్‌ మీదుగా సంజయ్‌ను  తీసుకెళ్తుండగా వాహనం మొరాయించడంతో మరో వాహనంలో సంజయ్‌ను తీసుకెళ్లారు. అయితే పోలీసు వాహనాలు హైదరాబాద్‌ వైపు వెళ్లాయి. బుధవారం  బండి సంజయ్‌ అత్త ( సంజయ్‌ భార్య తల్లి) మరణించి తొమ్మిది రోజులు అవుతుండటంతో సంజయ్‌ కరీంనగర్‌కు వచ్చారు.

బుధవారం ఉదయం టెన్త్‌ పేపర్‌ లీకేజీ వ్యవహారంపై ప్రెస్‌ మీట్‌ పెట్టేందుకు సిద్ధమవుతుండగా పోలీసులు ఆకస్మికంగా అరెస్టు చేయడం గమనార్హం. కాగా సంజయ్‌ అరెస్టును బీజేపీ తీవ్రంగా పరిగణిస్తోందని, అరెస్టుకు కారణం చెప్పకుండా అర్ధరాత్రి ఇంటిపై దాడి చేసి అరెస్టు చేస్తారా? అని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్‌ సర్కార్‌కు మూడిందని అన్నారు.   

Videos

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

నేను తాడిపత్రి పోతా.. ఏం పీకుతారో పీక్కోండి.. మాస్ వార్నింగ్

మరి గోరం... హీరోయిన్ ఎంగిలి చేసిన బాటిల్ ధర రూ.3 లక్షలు..!

అనంతపురం రూరల్ EX ZPTCపై పోలీసుల ఓవర్ యాక్షన్

Photos

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)

+5

ప్రభాస్ హీరోయిన్ కొత్త ఫొటోలు! (ఫొటోలు)

+5

సన్ ఫ్లవర్ తో రితికా నాయక్‌ (ఫొటోలు)