Breaking News

20 ఏళ్లుగా ఇంట్లోనే బంధించి.. 

Published on Mon, 05/15/2023 - 03:52

లంగర్‌హౌస్‌: భార్యపై అనుమానంతో 20 ఏళ్లుగా ఆమెను గదిలో పెట్టి బంధించి, నరకం చూపించాడు. ఎవరితో మాట్లాడినా అనుమానిస్తూ అనేకమార్లు ఇళ్లు మారాడు. చివరకు నాంపల్లి నుంచి లంగర్‌హౌస్‌ బాగ్దాద్‌ కాలనీకి మకాం మార్చాడు. పక్కింటి వారితో మాట్లాడిందని ఆరాతీసి భా ర్యను అతికిరాతకంగా హతమార్చాడు. ఈ సంఘటన లంగర్‌హౌస్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో శనివారం అర్ధరాత్రి జరిగింది.

ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌ తెలిపిన వివరాల ప్రకారం.. పాతబస్తీలో నివాసముండే జహంగీర్‌కు పంజగుట్టలో నివాసముండే కనీజ్‌బేగం(40)తో 2004లో వివాహమైంది. వీరికి ఇద్ద రు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు. ఆటో నడిపించే జహంగీర్‌ పెళ్లైన నాటినుంచే భార్యను అనుమానిస్తూ వేధిస్తున్నాడు. చివరకు తన తల్లితో కూడా భార్యను ఎక్కువగా మాట్లాడనిచ్చేవాడు కాదు.

అతను బ యటకు వెళ్లే సమయంలో భార్యను గదిలో ఉంచి బయట నుండి తాళం వేసుకొని వెళ్లిపోయే వాడు. గొడవలు చూసి ఇళ్ల యజమానులు హెచ్చరించడంతో పలుమార్లు ఇళ్లు మారాడు. 10 ఏళ్ల కిందట గొడవలు పెరగడంతో నలుగురు పిల్లలు అయ్యాక అనుమానమేంటని సర్ది చెప్పిన పెద్దలు కనీజ్‌ను మళ్లీ కాపురానికి పంపించారు.  

చిన్న కూతురును అడిగి... 
భార్యపై అనుమానంతో ఇళ్లు మారుతున్న జహంగీర్‌ పన్నెండు రోజుల క్రితం లంగర్‌హౌస్‌ బాగ్దాద్‌ కాలనీకి మకాం మార్చాడు. ఐదు రోజుల కిందట తన చిన్న కూతురుని పిలిచి అమ్మ ఇక్కడ ఎవరితో అయిన మాట్లాడిందా అని అడిగాడు. పక్కింటి వారితో మాట్లాడిందని కూతురు చెప్పడంతో.. ఊగిపోయిన జహంగీర్‌ భార్యను నడివీధిలో దారుణంగా కొట్టాడు. దీంతో పిల్లలను తీసుకొని ఎండీలైన్స్‌లో నివాసముండే తన అన్న గఫార్‌ ఇంటికి వెళ్లింది.

శనివారం సాయంత్రం గఫార్‌ ఇంటికి వెళ్లిన జహంగీర్‌.. కలిసి ఉందామని నమ్మబలికి, పిల్లలను అక్కడే వదిలి భార్యను బాగ్దాద్‌ కాలనీలోని ఇంటికి తీసుకొచ్చారు. రాత్రి భోజనం చేశాక భార్యతో మరోమారు గొడ­వ పడి... చున్నీతో ఆమె గొంతును బిగించి హత్య చేశాడు. అనంతరం లంగర్‌హౌస్‌ పోలీస్‌స్టేషన్‌కి వెళ్లి భార్యను హత్య చేశానని చెప్పి లొంగిపోయాడు. కేసు నమోదు చేసిన పోలీసులు సంఘటనా స్థలంలో ఆధారాలు సేకరించి మృతదేహాన్ని ఉస్మానియా మార్చూరీకి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.  

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)