Breaking News

గోవాలో తాడేపల్లిగూడెం యువకుడి హత్య

Published on Fri, 01/03/2025 - 05:32

తాడేపల్లిగూడెం: నూతన సంవత్సర వేడుకలను మిత్రులతో సంతోషంగా జరుపుకుందామని గోవా వెళ్లిన పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం యువకుడు హత్యకు గురయ్యాడు. వివరాలు.. తాడేపల్లిగూడెం పట్టణానికి చెందిన బొల్లా రవితేజ(28) హైదరాబాద్‌లోని ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో పనిచేస్తున్నాడు. రవితేజతో పాటు మరో నలుగురు యువకులు, ముగ్గురు యువతులు నూతన సంవత్సర వేడుకలు జరుపుకునేందుకు శని­వారం గోవా వెళ్లారు. 

రెండు రోజుల పాటు గోవా­లోని పలు పర్యాటక ప్రాంతాలను సందర్శించి.. డిసెంబర్‌ 30వ తేదీ అర్ధరాత్రి నార్త్‌గోవా జిల్లా కలంగూట్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఒక రెస్టారెంట్‌కు వెళ్లారు. అర్ధరాత్రి అయినందున బిల్లు మీద అధికంగా చెల్లించాలని రెస్టారెంట్‌ యజమాని డిమాండ్‌ చేయడంతో.. అక్కడి సిబ్బందికి, రవితేజ స్నేహితులకు మధ్య గొడవ జరిగింది. ఈ సమ­యంలో తన స్నేహితురాలితో అక్కడి సిబ్బంది అస­భ్యంగా ప్రవర్తించడంతో రవితేజ జోక్యం చేసుకు­న్నాడు. 

వెంటనే రెస్టారెంట్‌ సిబ్బంది కర్రలతో రవితేజతో పాటు అతని స్నేహితులపై విచక్ష­ణారహితంగా దాడి చేశారు. వెదురు కర్ర విరిగి గుచ్చుకోవడంతో రవితేజ తలకు తీవ్ర గాయమైంది. మిగిలినవారు స్వల్పంగా గాయప­డ్డారు. రవితేజను ఆస్పత్రికి తరలిస్తుండగా.. ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయం తెలుసు­కున్న స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకు­ని.. రవితేజ స్నేహితులను విచారించారు. దాడి చేసిన నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.

Videos

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు