Breaking News

AP: మహిళా పోలీసు అనుమానాస్పద మృతి.. కారణం అదేనా?

Published on Sun, 02/02/2025 - 09:12

సాక్షి, మదనపల్లె: సచివాలయ మహిళా పోలీసు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన మదనపల్లెలో చోటుచేసుకుంది. ఈ ఘటనపై వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని రామారావుకాలనీ స్టోర్‌వీధికి చెందిన అరుణమ్మ, రెడ్డెప్పల కుమార్తె రెడ్డిరోజా(35)ను, పట్టణంలోని నిమ్మనపల్లె రోడ్డు విద్యోదయా కాలనీకి చెందిన లక్ష్మీరవికుమార్‌తో 16 ఏళ్ల క్రితం వివాహం జరిపించారు. రెడ్డిరోజా కలికిరి మండలం పారపట్ల సచివాలయంలో మహిళా పోలీస్‌గా పనిచేస్తుండగా, కలికిరి పట్టణంలోని ముత్తూట్‌ ఫైనాన్స్‌ కంపెనీలో లక్ష్మీరవికుమార్‌ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. దంపతులు ఇద్దరూ కలికిరిలో నివాసం ఉంటున్నారు.

రెడ్డిరోజా శనివారం పెన్షన్‌ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని ఇంటికి వచ్చిన అనంతరం మదనపల్లెలో బంధువుల ఇంటిలో జరుగుతున్న శుభకార్యానికి హాజరైంది. సాయంత్రం భర్తతో కలిసి రామారావుకాలనీలోని ఇంటికి వెళ్లింది. అక్కడే ఇద్దరూ ఒకే గదిలో ఉండగా, భర్త టీ కోసం బయటకు వచ్చి పది నిమిషాల అనంతరం గదిలోకి వెళ్లాడు. అప్పటికే రెడ్డిరోజా చీరచున్నీతో గదిలోని ఫ్యాన్‌కు ఉరివేసుకుని వేలాడుతుండగా కిందకు దించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. అక్కడి నుంచి హుటాహుటిన రెడ్డిరోజాను మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆమె అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతదేహాన్ని మార్చురీ గదికి తరలించారు. పోలీసులకు సమాచారం అందించారు. ఏఎస్‌ఐ రమణ ఆస్పత్రికి చేరుకుని కుటుంబ సభ్యులను అడిగి వివరాలు సేకరించారు.

అయితే, గత 15 సంవత్సరాలుగా తమకు పిల్లలు లేకపోవడం, అనేక ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోవడంతో తన భార్య రెడ్డిరోజా తీవ్ర మనస్తాపానికి గురైందన్నారు. పలుమార్లు ఈ విషయమై తన వద్ద బాధపడేదని, శనివారం శుభకార్యంలో మరోసారి రెడ్డిరోజా మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడిందని భర్త లక్ష్మీరవికుమార్‌ చెప్పారు. కాగా, రెడ్డిరోజా తల్లిదండ్రులు అరుణమ్మ, రెడ్డెప్పలు బంధువులతో కలిసి ఆస్పత్రికి చేరుకుని తమ బిడ్డ మృతికి అల్లుడు లక్ష్మీ రవికుమార్‌ కారణమని ఆరోపిస్తూ గొడవకు దిగారు. గదిలో ఉన్న 10 నిమిషాల్లోనే తమ కుమార్తె ఎలా ఉరివేసుకుంటుందని వాదనకు దిగారు. ఆస్పత్రి అవుట్‌పోస్ట్‌ పోలీస్‌ సిబ్బంది వారికి సర్దిచెప్పి, స్టేషన్‌లో ఫిర్యాదు చేయాల్సిందిగా సూచించారు. దీంతో అక్కడి నుంచి వెళ్లి వారు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు