Breaking News

Banjara Hills: యువతులను ఎరగా వేసి..

Published on Mon, 05/06/2024 - 07:04

హైదరాబాద్: బంజారాహిల్స్‌ రోడ్డు నంబర్‌–14లోని ఆఫ్టర్‌ 9 పబ్‌లో సాగుతున్న చీకటి వ్యాపారం గుట్టును   వెస్ట్‌జోన్‌ టాస్‌్కఫోర్స్‌ పోలీసులు రట్టుచేశారు. శనివారం రాత్రి ఆఫ్టర్‌ 9 పబ్‌కు పెద్ద సంఖ్యలో యువతీ యువకులు వచ్చారనే సమాచారంతో దాడులు చేశారు. పబ్‌ లోపలికి జంటలకు మాత్రమే అనుమతి ఉండగా.. ఇక్కడకు వస్తున్న యువకులకు, యువతులకు ఎలాంటి సంబంధాలు లేవని గుర్తించారు. ఇక్కడికి వచ్చే యువకులకు తాను అద్దెకు తీసుకువచ్చిన యువతులను పబ్‌ యజమాని ఎరగా వేస్తున్నట్లుగా గుర్తించారు. 

దీంతో పబ్‌ యజమాని బరిదక సతీష్‌, భవన యజమాని విద్యాధర మూర్తి, పబ్‌ మేనేజర్‌ కోరాడ శ్రీనివాసరావు, డీజే నిర్వాహకుడు అజ్మత్‌ఖాన్, క్యాషియర్‌ శ్రీనివాసరావు, అయిదుగురు బౌన్సర్లు సాయితేజ, మహేష్‌, కిషోర్,  వినీల్, శేఖర్‌లతో పాటు 131 మంది యువకులు, 32 మంది యువతులను అరెస్టు చేసి బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. నిబంధనలు బేఖాతరు చేసిన ఆఫ్టర్‌ 9 పబ్‌ లైసెన్స్‌ను రద్దు చేయాల్సిందిగా ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌కు లేఖ రాశారు. అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నందున ఈ బిల్డింగ్‌ను సీజ్‌ చేయాలని సికింద్రాబాద్‌ ఆర్డీఓకు లేఖ రాసినట్లు పోలీసులు తెలిపారు. 
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)