Breaking News

స్నేహితురాలిని అలా చూస్తూ..! ‘స్నేహం కోసం..’ సినిమాలో క్లైమాక్స్‌లా

Published on Sun, 03/12/2023 - 03:57

తిరుపతి రూరల్‌: కుటుంబ బంధాలతోపాటు వారి మధ్య స్నేహం పెరిగింది. అలా 64 ఏళ్లపాటు తమ స్నేహబంధాన్ని కొనసాగించారు. అనారోగ్యంతో మృతి చెందిన స్నేహితురాలిని కడచూపు చూసేందుకు వచ్చింది. నిర్జీవంగా మారిన స్నేహితురాలిని తదేకంగా చూస్తూ.. తానూ తుది శ్వాస విడిచింది. ‘స్నేహం కోసం..’ సినిమాలో క్లైమాక్స్‌ సన్నివేశాన్ని తలపించిన ఈ ఘటన తిరుపతి మండలం మల్లంగుంటలో శనివారం చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్లితే... మల్లంగుంటకు చెందిన దివంగత కంబాల గంగయ్య భార్య కంబాల మునెమ్మ(80), అదే గ్రామానికి చెందిన అంజూరి పాపమ్మ (80) వరుసకు అక్కచెల్లెళ్లు. అంతకుమించి 64 ఏళ్లుగా మంచి స్నేహితులు. పిల్లల చదువుల నుంచి వారి పెళ్లిళ్లు, మనవళ్ల యోగక్షేమాల వరకు ఇరువురూ మాట్లాడుకునేవారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కంబాల మునెమ్మ ఈ నెల 9న రాత్రి మృతి చెందింది.

ఆమె కుమారుడు అమెరికాలో ఉండటంతో శనివారం సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. గుండె సంబంధ వ్యాధితో బాధపడుతున్న అంజూరి పాపమ్మకు మునెమ్మ చనిపోయిన విషయం చెప్పకుండా కుటుంబ సభ్యులు దాచారు. చివరి నిమిషంలో తెలుసుకున్న పాపమ్మ అనారోగ్యంతో ఉన్నప్పటికీ స్నేహితురాలు మునెమ్మను కడచూపు చూసేందుకు శనివారం సాయంత్రం వచ్చింది.

స్నేహితురాలిని ఫ్రీజర్‌ బాక్స్‌లో అచేతన స్థితిలో చూస్తూ పాపమ్మ కుప్పకూలి అక్కడే ప్రాణాలు వదిలింది. మునెమ్మ అంత్యక్రియలను శనివారమే ముగించగా.. పాపమ్మకు ఆదివారం నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు. స్నేహబంధానికి నిదర్శనంగా నిలిచిన మునెమ్మ, పాపమ్మ స్నేహంపై గ్రామంలో అందరూ చర్చించుకుంటున్నారు.

Videos

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)