Breaking News

కాజీపేటలో దారుణం.. వీధికుక్కల దాడిలో బాలుడి మృతి

Published on Fri, 05/19/2023 - 12:24

సాక్షి, హన్మకొండ: వీధి కుక్కలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. ఏ వీధిలో చూసిన గుంపులు గుంపులుగా తిరుగుతూ రోడ్లపై వెళ్తున్న పాదచారులు, వాహనాదారుల వెంటపడి తీవ్రంగా కరుస్తున్నాయి. ఇటీవల కాలంలో కుక్కల దాడులు విపరీతంగా పెరిగిపోయాయి. ప్రతిరోజు ఏదో ఒక చోట వరుస ఘటనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. ముఖ్యంగా చిన్నారులపై విచక్షణారహితంగా దాడి చేసి వారి ప్రాణాలను పొట్టన పెట్టుకుంటున్నాయి.

తాజాగా హన్మకొండ జిల్లా కాజీపేటలో వీధికుక్కలు  మరో బాలుడి ప్రాణాలు తీశాయి. వీధికుక్కలు దాడి చేయడంతో ఎనిమిదేళ్ల బాలుడు మృత్యువాతపడ్డాడు. రైల్వే క్వార్టర్స్‌లోని చిల్డ్రన్స్‌ పార్క్‌ వద్ద ఆడుకుంటుండగా మల్కాన్‌ సింగ్‌, సునీత దంపతుల కుమారుడు చోటు అనే చిన్నారిపై కుక్కలు దాడి చేశాయి. దీంతో తీవ్ర గాయాలపాలైన బాలుడిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు వెల్లడించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఎంజీఎంకు తరలించారు. 

కాగా పని కోసం మల్కాన్‌ సింగ్‌ కుటుంబం గురువారమే యూపీ నుంచి ఖాజీపేటకు వలస వచ్చారు. వీరు నగరంలో ఉంగరాలు అమ్ముతూ జీవనం సాగిస్తున్నారు. పొట్ట కూటికోసం వస్తే.. మరుసటి రోజే కుమారుడు చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

ఎమ్మెల్యే పరామర్శ
కాజీపేటలో కుక్కల దాడిలో ప్రాణాలు కోల్పోయిన బాలుడి కుటుంబాన్ని ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్, మేయర్ గుండు సుధారాణి పరామర్శించారు. మృతుడి కుటుంబానికి లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. మృతదేహాన్ని స్వంత ఖర్చులతో యూపీకి తరలించారు. నగరంలో ఒక్కో వాడలో 200 వరకు కుక్కలు ఉన్నాయని, కుక్కలను చంపడం నేరం కావడంతో వాటి సంతతిని కంట్రోల్ చేసే చర్యలు చేపట్టామని ఎమ్మెల్యే తెలిపారు. 

కుక్కలకు కేర్ సెంటర్ ఏర్పాటు చేసి వాటికి వ్యాధులు రాకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కుక్కల దాడుల నివారణ కోసం హైదరాబాద్ నుంచి ప్రత్యేక బృందాన్ని రప్పిస్తామన్నారు ఇదిలా ఉంటే గడిచిన 20 రోజుల్లో వరంగల్ జిల్లాలో ఇద్దరు కుక్కల దాడిలో ప్రాణాలు కోల్పోవడం, పలువురు గాయపడ్డడం కలకలం సృష్టిస్తుంది.
చదవండి: పైళ్లెన వారం రోజులకే విషాదం నింపిన క్షణికావేశం

Videos

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)