Breaking News

పాత మొబైల్‌ ఫోన్లతో సైబర్‌ నేరాలు

Published on Thu, 08/22/2024 - 00:30

సాక్షి, హైదరాబాద్‌: డబ్బులు, ప్లాస్టిక్‌ వస్తువులు ఇచ్చి ప్రజల నుంచి పాత, వినియోగంలో లేని మొబైల్‌ ఫోన్లను కొనుగోలు చేసి సైబర్‌ నేరాలకు వాడుతున్న కేటుగాళ్ల ముఠాను రామగుండం తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో (టీజీ సీఎస్‌బీ) అధికారులు అరెస్టు చేశారు. పట్టుబడిన ముగ్గురు నిందితుల వద్ద నుంచి ఏకంగా 4 వేల పాత మొబైల్‌ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. తక్కువ ధరకు కొనుగోలు చేసిన మొబైల్‌ ఫోన్లను బిహార్‌లోని కొందరికి ఎగుమతి చేస్తున్నట్టు దర్యాప్తులో వెల్లడైంది. 

సేకరించిన పాత మొబైల్‌ ఫోన్లను రిపేర్‌ చేసి వాటిని జామ్‌తార, దియోగఢ్‌లోని సైబర్‌ నేరగాళ్లకు సరఫరా చేస్తున్నట్టు నిందితులు వెల్లడించారు. వారిని బిహార్‌కు చెందిన మహ్మద్‌ షమీమ్, అబ్దుల్‌ సలామ్, మహ్మద్‌ ఇఫ్తికర్‌గా గుర్తించారు. నిందితులపై రామగుండం సైబర్‌ క్రైం పోలీస్‌ స్టేషన్‌లో ఐటీ యాక్ట్‌ 66 డీ, బీఎన్‌ఎస్‌ఎస్‌లోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టు టీజీ సైబర్‌ సెక్యూరిటీ డైరెక్టర్‌ శిఖాగోయల్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.  
  
ఇలా చిక్కారు..
బిహార్‌కు చెందిన కొందరు వ్యక్తులు పట్టణంలో తిరుగుతూ పాత మొబైల్‌ ఫోన్లను తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నట్టు రామగుండం సైబర్‌ క్రైం పోలీస్‌స్టేషన్‌ సిబ్బందికి విశ్వసనీయ సమాచారం అందింది. వారు గోదావరిఖనిలో తనిఖీ చేయగా ముగ్గురు అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపించారు. వారిని అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా 4 వేల పాత మొబైల్‌ ఫోన్లు పట్టుబడ్డాయి. 

గత నెల రోజులుగా రామగుండంతో పాటు చుట్టుపక్కల జిల్లాల నుంచి పాత మొబైల్‌ ఫోన్లు కొనుగోలు చేసి బిహార్‌లోని తమ ముఠాలకు చేరవేసినట్టు నిందితులు అంగీకరించారు. కాగా అపరిచిత వ్యక్తులకు పాత మొబైల్‌ ఫోన్లను విక్రయించవద్దని శిఖాగోయల్‌ సూచించారు. సైబర్‌ నేరాలు జరిగినప్పుడు మొబైల్‌ ఫోన్‌ పాత యజమాని డివైస్‌ ఐడెంటీనే పోలీసుల దర్యాప్తులో బయటకు వస్తుందని, దీనివల్ల చిక్కుల్లో పడతారని హెచ్చరించారు.  

Videos

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)