Breaking News

పొట్టలో రూ.26 కోట్ల విలువైన కొకైన్‌ 

Published on Mon, 02/10/2025 - 06:14

న్యూఢిల్లీ: మాదకద్రవ్యాలను స్మగ్లింగ్‌ చేస్తున్న ఇద్దరు విదేశీయులను కస్టమ్స్‌ అధికారులు పట్టుకున్నారు. రూ.26 కోట్ల విలువైన కొకైన్‌ను స్వా«దీనం చేసుకున్నారు. జనవరి 24న ఢిల్లీ విమానాశ్రయంలో అరెస్టు చేసి... అనంతరం కొకైన్‌ను స్వా«దీనం చేసుకున్నట్లు కస్టమ్స్‌ అధికారులు ఆదివారం వెల్లడించారు.

 జనవరి 24న సావోపాలో నుంచి వచ్చిన బ్రెజిల్‌ మహిళ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్‌ తనిఖీలను తప్పించుకొనేందుకు గ్రీన్‌ చానల్‌ దాటుతుండగా పట్టుకున్నారు. డ్రగ్స్‌ క్యాప్సూల్స్‌ తీసుకున్నట్లు విచారణలో అంగీకరించడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. చికిత్స చేసి 100 క్యాప్సూల్స్‌ను బయటకు తీశారు. వాటిలో కొకైన్‌గా అనుమానిస్తున్న తెల్లటి పొడి ఉన్నట్లు తేలింది. స్వా«దీనం చేసుకున్న డ్రగ్స్‌ బరువు 802 గ్రాములు కాగా, వీటి విలువ రూ.12.03 కోట్లు ఉంటుందని అంచనా. 

అదే రోజు అడిస్‌ అబాబా నుంచి వస్తున్న కెన్యా ప్రయాణికుడిని కస్టమ్స్‌ అధికారులు అడ్డుకున్నారు. విచారణలో కొకైన్‌ క్యాప్సూల్స్‌ మింగినట్లు అంగీకరించాడు. అతడిని కూడా ఆస్పత్రికి తరలించి మొత్తం 70 క్యాప్సూల్స్‌ను బయటకు తీశారు. క్యాప్సుల్స్‌లో 996 గ్రాముల హై ప్యూరిటీ కొకైన్‌ ఉన్నట్లు గుర్తించారు. రూ.14.94 కోట్ల విలువైన డ్రగ్స్‌గా గుర్తించారు. ఇద్దరినీ అరెస్టు చేసి.. ఈ ఆపరేషన్‌ వెనుక ఉన్న మాదకద్రవ్యాల సిండికేట్‌పై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.  

Videos

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)