Breaking News

15 మంది గంజాయి స్మగ్లర్ల అరెస్ట్‌

Published on Sat, 07/20/2024 - 04:30

విజయవాడస్పోర్ట్స్‌:   ఆంధ్రా–ఒడిశా సరిహద్దు ప్రాంతంలోని ఏజెన్సీల నుంచి సేకరించిన గంజాయిని విజయవాడ, పరిసర ప్రాంతాల్లో విక్రయిస్తున్న ముఠాలోని ప్రధాన నిందితుడితో పాటు మరో14 మందిని ఎన్టీఆర్‌ జిల్లా పోలీస్‌ యంత్రాంగం అరెస్ట్‌ చేసింది. డీజీపీ ద్వారకా తిరుమలరావు, జిల్లా పోలీస్‌ కమిషనర్‌ ఎన్‌.వి.రాజశేఖరబాబు ఆదేశాలతో ఈ ముఠా కదలికలపై ప్రత్యేక దృష్టి సారించింది. 

యాంటి నార్కోటిక్‌ సెల్, టాస్క్‌ఫోర్స్, లా అండ్‌ ఆర్డర్‌ బృందాలు సంయుక్తంగా నిర్వహించిన ఈ ఆపరేషన్‌ వివరాలను విజయవాడ కమాండ్‌కంట్రోల్‌ రూంలో విజయవాడ డిప్యూటీ పోలీస్‌ కమిషనర్‌ (డీసీపీ) హరికృష్ణ శుక్రవారం వెల్లడించారు.

ప్రధాన నిందితుడు పింక్‌రౌత్‌..
పోలీసుల అదుపులో నున్న 14మంది గంజాయి స్మగ్లర్లు ఇచ్చిన సమాచారంతో గత కొన్నేళ్లుగా గుట్టుచప్పుడు కాకుండా గంజాయి స్మగ్లింగ్‌ చేస్తున్న ప్రధాన నిందితుడు ఒడిశాకు చెందిన పింకి రౌత్‌ను అరెస్ట్‌ చేశారు. ఆంధ్రా–ఒడిశా సరిహద్దు ప్రాంతా లైన బరంపురం, పీలేరు ఏజెన్సీ ప్రాంతాల్లోని వ్య క్తుల నుంచి గంజాయిని సేకరించి విజయవాడకు సరఫరా చేయడంలో పింక్‌రౌత్‌ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడని డీసీపీ హరికృష్ణ తెలిపారు.ఇతనిపై గతంలో మాచవరం పోలీస్‌స్టేషన్‌లో అనేక కేసులు నమోదయ్యాయన్నారు. 

విజయవాడ సిటీ, చుట్టుపక్కలనున్న పలు ప్రాంతాల్లో గంజాయిని విక్రయిస్తున్న గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన గోగినేని మాధవరావు, తెలంగాణా, మేడ్చల్, పోతయిపల్లికి చెందిన మురుగన్‌ మణికంఠ, సంకేలి గణేష్, కృష్ణా జిల్లా, పెనమలూరుకు చెందిన షేక్‌ మొహమ్మద్‌ గౌస్‌ అబ్దుల్‌ హబీబ్, విజయవాడ అజిత్‌ సింగ్‌నగర్‌కు చెందిన మర్రి రఘురాం, విజయవాడ మాచవరం డౌన్‌కు చెందిన కొమ్ము రాకేశ్,  విజయవాడ భవానీపురానికి చెందిన పాలెటి మమతరాజు, మహమ్మద్‌ ముజ్జమిల్‌ సుల్తాన్, షేక్‌ నజీర్, మత్తే నాని, ఇల్లురి మధుసూదన్‌రెడ్డి, కృష్ణలంకకు చెందిన అడపాల వంశీ, అమన్‌సింగ్‌ను అరెస్ట్‌ చేసినట్లు చెప్పారు.

 వీరిందరిపై గతంలో అనేక కేసులు నమోదయినట్లు చెప్పారు. నిందితుల నుంచి 90.5 కేజీల గంజాయితో పాటు ఒక స్కూటీని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. కాగా, ప్రజలు 91211 62475కు గంజాయి సమాచారం ఇవ్వాలని ప్రజ లను కోరారు. సమాచారం ఇచ్చిన వ్యక్తుల వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు.  టాస్క్‌ఫోర్స్‌ ఏడీసీపీ శ్రీహరి, సీఐలు నాగేంద్రకుమార్, శ్రీధర్, రమేష్‌ పాల్గొన్నారు.  

#

Tags : 1

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)