ఢిల్లీలో ప్రభుత్వాధికారి నిర్వాకం.. స్నేహితుడి కుమార్తెను..

Published on Sun, 08/20/2023 - 19:04

న్యూఢిల్లీ: మహిళలు, పిల్లలను సంరక్షించాల్సిన బాధ్యత గల పదవిలో ఉండి పశువులా వ్యవహరించాడొక కామాంధుడు.ఢిల్లీ ప్రభుత్వంలో పనిచేస్తున్న ఒక అధికారి తన స్నేహితుడి టీనేజీ కూతురిపై ఎన్నో నెలలుగా అత్యాచారం చేస్తూ చివరికి పట్టుబడ్డాడు. అతనికి సహకరించినందుకు ఆతడి భార్య పైన కూడా కేసు నమోదు చేశారు ఢిల్లీ పోలీసులు. 

ఢిల్లీ ప్రభుత్వంలో మహిళా శిశు సంక్షేమాభివృద్ధి శాఖలో పనిచేస్తున్న ఒక సీనియర్ అధికారి తన స్నేహితుడు 2020లో మరణించడంతో అతడి మైనర్ కుమార్తె(14)ను తన ఇంటికి తీసుకొచ్చాడు. అప్పటి నుండి ఆ బాలిక వారితోనే కలిసి ఉంటోంది. ఈ వ్యవధిలో ప్రభుత్వాధికారి ఆ అమ్మాయిపై అనేక మార్లు అత్యాచారం చేసినట్లు మధ్యలో తాను గర్భం దాల్చగా అతడి భార్య, కుమారుడు కొన్ని మందులిచ్చి గర్భాన్ని తొలగించారని బాలిక పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపింది. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం టీనేజీ అమ్మాయి ప్రస్తుతం చికిత్స తీసుకుంటోందని ఆమె నుండి ఇంకా స్టేట్‌మెంట్ తీసుకోవాల్సి ఉందని అన్నారు. ప్రభుత్వాధికారిపై పోక్సో చట్టం తోపాటు ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని, నిందితుడికి సహకరించినందుకు అధికారి భార్యపైన కూడా కేసు నమోదు చేసినట్లు తెలిపారు. 

ఇది కూడా చదవండి: ఐదేళ్ల బాలుడిపై అమానుషం.. ఎత్తి నేలకేసి కొట్టి.. 

Videos

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)