Breaking News

వొడాఫోన్‌లో ప్రభుత్వానికి భారీ వాటా 

Published on Wed, 02/08/2023 - 08:53

న్యూఢిల్లీ: మొబైల్‌ టెలికం కంపెనీ వొడాఫోన్‌ ఐడియా వడ్డీ బకాయిల చెల్లింపుకింద ప్రభుత్వానికి భారీ స్థాయిలో ఈక్విటీని జారీ చేయనుంది. సుమారు రూ. 16,133 కోట్లకుగాను రూ. 10 ముఖ విలువగల దాదాపు 1,613.32 కోట్ల షేర్లను కేటాయించనుంది. స్థూల సర్దుబాటు ఆదాయం(ఏజీఆర్‌) వాయిదా, స్పెక్ట్రమ్‌ వేలం చెల్లింపులపై వడ్డీ కింద వొడాఫోన్‌ ఐడియా ఈక్విటీ కేటాయింపునకు ప్రతిపాదించింది. ఇందుకు తాజాగా కంపెనీ బోర్డు ఆమోదముద్ర వేసింది. వెరసి వడ్డీ.. ఈక్విటీగా మార్పు చెందనుంది. 

ఇది కంపెనీ మొత్తం విస్తారిత ఈక్విటీలో 33.44 శాతం వాటాకు సమానంకానుంది. కంపెనీ మొత్తం చెల్లించిన మూలధన రూ. 48,252 కోట్లను మించనుంది. కంపెనీలో ప్రమోటర్లు వొడాఫోన్‌ గ్రూప్‌ వాటా 32.29 శాతానికి, ఆదిత్య బిర్లా గ్రూప్‌ వాటా 18.07 శాతానికి చేరనున్నాయి. 2018లో విలీనం తదుపరి 43 కోట్ల మొబైల్‌ వినియోగదారులతో వొడాఫోన్‌ ఐడియా 35 శాతం మార్కెట్‌ వాటాను పొందింది. తద్వారా అతిపెద్ద కంపెనీగా నిలిచిన సంస్థ ప్రస్తుతం 24.3 కోట్లమంది కస్టమర్లతో 21.33 శాతానికి మార్కెట్‌ వాటాకు పరిమితమై మూడో ర్యాంకుకు చేరింది.  ఈ వార్తల నేపథ్యంలో వొడాఫోన్‌ షేరు బీఎస్‌ఈలో 4 శాతం పతనమై రూ. 7.94 వద్ద ముగిసింది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)