amp pages | Sakshi

సాంకేతికత అవసరం

Published on Sat, 11/18/2023 - 00:48

వ్యవసాయంలో సాంకేతికత వినియోగం అవసరమని జిల్లా వ్యవసాయాధికారి మురళీకృష్ణ తెలిపారు.

శనివారం శ్రీ 18 శ్రీ నవంబర్‌ శ్రీ 2023

సాక్షి, చిత్తూరు : ప్రజలకు ఆరోగ్య భరోసా కల్పిస్తూ.. దేశంలోనే తొలిసారిగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వినూత్న పథకానికి శ్రీకారం చుట్టారు. జగనన్న ఆరోగ్య సురక్ష కింద క్షేత్రస్థాయిలో రోగులకు వైద్యసేవలందించేలా కార్యక్రమం చేపట్టారు. ముమ్మరంగా 45 రోజులు పాటు వ్యాధిగ్రస్తులు తమ ఇళ్ల వద్దే కార్పొరేట్‌ వైద్యసేవలు అందుకున్నారు. ప్రత్యేక వైద్య నిపుణులు సైతం క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజలకు మెరుగైన సేవలందించారు. మరికొందరు రోగుల పరిస్థితి మేరకు కార్పొరేట్‌ పైస్థాయి ఆస్పత్రుల్లో వైద్యానికి సిఫార్సు చేశారు. అలాంటి వారికి ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచితంగా సేవలు, శస్త్ర చికిత్సలు అందించారు.

ఇంటింటికీ వెళ్లి..

జిల్లావ్యాప్తంగా వలంటీర్లు, ఆశ వర్కర్లు ఇంటింటికీ వెళ్లి ముందుగా పరీక్షలు నిర్వహించి, ఆరోగ్య క్యాంపులకు వచ్చేందుకు టోకెన్లు పంపిణీ చేశారు. ఎప్పుడు ఏ వైద్య నిపుణుడు వస్తారో ముందుగానే అందులో వివరంగా పేర్కొన్నారు.జిల్లాలోని రూరల్‌ ప్రాంతాల్లో 464, అర్బన్‌ ఏరియాల్లో 30 సురక్ష హెల్త్‌ క్యాంపులు నిర్వహించారు. ఆయా వైద్యశిబిరాల్లో 7 రకాలు పరీక్షలు నిర్వహించారు. సుమారు 175 రకాల మందులను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ క్రమంలో మొత్తం 14,24,477 మంది వైద్యసేవలు పొందారు. సుమారు 2,688 మందిని కార్పొరేట్‌, ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు రెఫర్‌ చేశారు. అందులో వెయ్యిమంది ఇప్పటికే చికిత్స చేయించుకున్నారు. మిగిలిన వారికి కూడా సత్వరమే వైద్యం అందించేందుకు ఆరోగ్యశాఖ అధికారులు చర్యలు చేపడుతున్నారు.

మొత్తం వైద్యసేవలందుకున్న వారు

: 14,12,477 మంది

నిర్వహించిన మెడికల్‌ క్యాంపులు : 494

ఇతర ఆస్పత్రులకు రెఫర్‌ చేయబడిన వారు

: 2,688

ఆయా హాస్పిటళ్లలో

ఇప్పటికే చికిత్స పొందిన వారు : 623

రక్తహీనత పరీక్షలు చేయించుకున్నవారు

: 7,35,242

రక్తపోటు బాధితులు : 10,772

కంటి వెలుగు పరీక్షలు చేయించుకున్నవారు

: 27,367

కళ్ల జోళ్లు పొందిన వారు : 17,382

గుర్తించిన క్యాటరాక్ట్‌ కేసులు : 1,962

కళ్లకు చేసిన శస్త్రచికిత్సలు : 224

– 8లో

– 8లో

న్యూస్‌రీల్‌

జిల్లా సమాచారం

ప్రజారోగ్య రక్షణకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోంది. ఉచితంగా అత్యున్నత వైద్యసేవలు అందించేందుకు పకడ్బందీ కార్యాచరణ అమలు చేస్తోంది. అందులో భాగంగా జగనన్న ఆరోగ్య సురక్ష పథకానికి శ్రీకారం చుట్టింది. తొలుత ఇంటింటికీ వెళ్లి వ్యాధిగ్రస్తులను గుర్తించేందుకు వలంటీర్లతో సర్వే చేపట్టింది. అనంతరం ఆయా సచివాలయాల పరిధిలో హెల్త్‌క్యాంపులు ఏర్పాటు చేసి నిపుణులైన వైద్యులతో చికిత్సలు చేయించింది. కావాల్సిన మందులు పంపిణీ చేసింది. అవసరమైన వారికి శస్త్రచికిత్సల కోసం కార్పొరేట్‌ ఆస్పత్రులకు రెఫర్‌ చేసి పైసా ఖర్చు లేకుండా ట్రీట్‌మెంట్‌ చేయిస్తోంది. ఈ క్రమంలో సర్కారు చిత్తశుద్ధిపై ప్రజానీకం హర్షాతిరేకం వ్యక్తం చేస్తోంది. దేశంలో ఎక్కడా లేని విధంగా సేవలందించడంపై ప్రశంసల జల్లు కురిపిస్తోంది.

జిల్లావ్యాప్తంగా 45 రోజులపాటు

మెడికల్‌ క్యాంపులు

జగనన్న ఆరోగ్య సురక్ష కింద

మెరుగైన వైద్యసేవలు

క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తించిన

స్పెషలిస్ట్‌ డాక్టర్లు

అవసరాల మేరకు

కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో శస్త్ర చికిత్సలు

Videos

బెంగళూరులో రేవ్ పార్టీ భగ్నం.. హైదరాబాద్ ఫామ్ హౌస్ లో నటి హేమ

రేవ్ పార్టీ పై హీరో శ్రీకాంత్ రియాక్షన్

ఏపీలో అల్లర్లపై.. డీజీపీకి సిట్ నివేదిక

జూన్ 4 తరువాత చూసుకుందాం: పెద్దిరెడ్డి

సస్పెండ్ అయి స్థానంలో కొత్త అధికారులు

"సాధించాం” అంటూ కన్నీళ్లు పెట్టుకున్న కోహ్లి, అనుష్క..

చరిత్ర సృష్టించిన హైదరాబాద్ యువ కెరటం అభిషేక్ శర్మ..

దొంగ ఓట్ల కోసం చంద్రబాబు, పురందేశ్వరి, పవన్ కళ్యాణ్ చేసిన కుట్ర..

అమెరికా పారిపోయిన అయ్యా.. కొడుకులు

ఏపీలో అల్లర్లు చేసింది వీరే..

Photos

+5

Hakim Shajahan Marriage: హీరోయిన్‌ను పెళ్లాడిన మలయాళ హీరో.. ఎంతో సింపుల్‌గా! (ఫోటోలు)

+5

Indraja Sankar Birthday Photos: విజిల్‌ నటి బర్త్‌డే సెలబ్రేషన్స్‌.. పెళ్లి తర్వాత భర్తతో తొలిసారి (ఫోటోలు)

+5

SRH Vs PBKS Highlights Photos: సన్ రైజర్స్ vs పంజాబ్..తారలతో నిండిన ఉప్పల్ స్టేడియం (ఫోటోలు)

+5

Shobha Shetty: కొత్తింటి కల సాకారం చేసుకున్న బిగ్‌బాస్‌ బ్యూటీ.. ప్రియుడితో గృహప్రవేశం (ఫోటోలు)

+5

నటుడు చందు కన్నుమూత.. వైరలవుతున్న పెళ్లి ఫోటోలు

+5

Afghanistan Floods: అఫ్ఘాన్‌ కొట్టుకుపోయింది.. మిగిలింది శూన్యమే (ఫొటోలు)

+5

ఏపీలో గెలిచేదెవరు? జడ్జ్‌మెంట్‌ డే 4th June (ఫొటోలు)

+5

చందు వైఫ్ షాకింగ్ కామెంట్స్

+5

Sangeetha Sringeri: పునీత్‌ రాజ్‌కుమార్‌ సమాధి వద్ద నటి బర్త్‌డే సెలబ్రేషన్స్‌ (ఫొటోలు)

+5

సంతోషంలో కావ్యా మారన్‌.. కేన్‌ విలియమ్సన్‌ను పలకరించి మరీ! (ఫొటోలు)