Breaking News

ఇన్‌ఫ్లుయెంజా వైరస్‌కు జైడస్‌ వ్యాక్సిన్‌: ఇక వారంతా సేఫ్!

Published on Thu, 02/27/2025 - 13:41

కొత్త రకం ఇన్‌ఫ్లూయెంజా వైరస్‌ నుంచి రక్షణ కోసం వ్యాక్సిన్‌ను ప్రవేశపెడుతున్నట్టు ఔషధ తయారీ సంస్థ 'జైడస్‌ లైఫ్‌సైన్సెస్‌' (Zydus Lifesciences) బుధవారం తెలిపింది.

ఫ్లూ నుంచి రక్షణ కోసం డబ్ల్యుహెచ్ఓ సిఫార్సు చేసిన కూర్పు ప్రకారం దేశంలోనే మొట్టమొదటి క్వాడ్రివలెంట్‌ ఇన్‌ఫ్లూయెంజా వైరస్‌ వ్యాక్సిన్‌ వ్యాక్సిఫ్లూ-4ను పరిచయం చేస్తున్నట్టు వెల్లడించింది. ఈ టీకాను సెంట్రల్ డ్రగ్ లాబొరేటరీ (CDL) ఆమోదించిందని కంపెనీ తెలిపింది.

రాబోయే ఫ్లూ సీజన్‌ ప్రబలంగా ఉంటుందని, దీనిని దృష్టిలో ఉంచుకుని నాలుగు ఇన్‌ఫ్లూయెంజా వైరస్‌ జాతులకు వ్యతిరేకంగా కాలానుగుణ రక్షణను, క్రియాశీల రోగనిరోధకతను అందించేలా క్వాడ్రివాలెంట్ ఇన్‌ఫ్లూయెంజా వ్యాక్సిన్‌ను తీసుకొచ్చినట్లు కంపెనీ వివరించింది. దీనిని సంస్థ అహ్మదాబాద్‌లోని వ్యాక్సిన్ టెక్నాలజీ సెంటర్ (VTC) అభివృద్ధి చేసింది.

ఇన్‌ఫ్లూయెంజా అనేది.. ఇన్‌ఫ్లూయెంజా వైరస్ వల్ల సోకే దగ్గు, తుమ్ముల వ్యాప్తిని నివారిస్తుంది. శ్వాసకోశ సంబంధిత వ్యాధులను ముందుగా గుర్తించి.. కావలసిన వ్యాక్సిన్ తీసుకోకపోతే, తీవ్ర అనారోగ్యం ఏర్పడుతుంది. కొన్ని సార్లు మరణానికి కూడా దారితీయవచ్చు. ముఖ్యంగా ఐదేళ్లలోపు పిల్లలు, వృద్ధులకు ఈ వ్యాక్సిన్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం, సీజనల్ ఇన్‌ఫ్లూయెంజా వైరస్ కారణంగా.. ప్రతి సంవత్సరం 2.9 లక్షల నుంచి 6.5 లక్షల మంచి మరణిస్తున్నారని తెలిసింది. కాబట్టి ఈ వ్యాక్సిన్ మరణాల రేటును తగ్గిస్తుందని చెబుతున్నారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)