Breaking News

బిలియనీర్‌ అయిపోయిన దీపిందర్ గోయల్

Published on Mon, 07/15/2024 - 17:05

ప్రముఖ ఫుడ్‌ డెలివరీ సం​స్థ జొమాటో (Zomato) వ్యవస్థాపకుడు, సీఈవో దీపిందర్ గోయల్ బిలియనీర్స్‌ క్లబ్‌లోకి చేరారు. గతేడాది నుంచి జొమాటో షేర్లలో రికార్డు ర్యాలీతో దీపిందర్‌ బిలియనీర్ అయ్యారు. 2023 జూలై కనిష్ట స్థాయి నుంచి కంపెనీ స్టాక్ 300 శాతానికి పైగా పెరిగింది.

జొమాటో స్టాక్ బీఎస్‌ఈలో రూ.230 వద్ద కొత్త రికార్డును నెలకొల్పింది రోజులో 2 శాతం లాభపడింది. దాని మార్కెట్ క్యాప్ రూ.1.8 ట్రిలియన్‌లకు చేరుకుంది. దీంతో గోయల్ నెట్‌వర్త్‌ రూ.8,300 కోట్లకు చేరుకోవడంతో భారతదేశపు అత్యంత ధనిక ప్రొఫెషనల్ మేనేజర్‌గా నిలిచాడు. ప్రస్తుతం గోయల్‌కు కంపెనీలో 36.95 కోట్ల షేర్లు లేదా 4.24 శాతం వాటా ఉంది.

జొమాటో క్విక్‌ కామర్స్‌ వ్యాపారం బ్లింకిట్‌ తోటి కంపెనీలను అధిగమించి ఊహించిన దాని కంటే ముందుగానే లాభదాయకంగా మారవచ్చు అనే అంచనాల మధ్య గతేడాది ప్రారంభం నుంచి జొమాటలో స్టాక్ గణనీయంగా పెరుగుతూ చ్చింది. 2025 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో బ్లింకిట్‌ ఇబీట ఆదాయం బ్రేక్ ఈవెన్‌గా మారవచ్చని కంపెనీ ఇంతకు ముందు పేర్కొంది. ఫుడ్ డెలివరీ వ్యాపారం లాభదాయకమైన యూనిట్ కావడం కూడా పెట్టుబడిదారుల సెంటిమెంట్‌ను పెంచింది.

మధ్యతరగతి కుటుంబం నుంచి..
మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన దీపిందర్‌ ఐఐటీ ఢిల్లీ నుంచి మ్యాథమెటిక్స్‌, కంప్యూటింగ్‌లో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. ఆహారం పట్ల తనకున్న మక్కువతో స్ఫూర్తి పొంది ఫుడ్‌ ఆర్డర్ చేయడానికి యాప్‌ను రూపొందించారు. బెయిన్& కంపెనీలో ఉన్నప్పుడే FoodieBay.comని స్థాపించారు. దీన్ని తరువాత Zomato.com అని పేరు మార్చారు. 2011లో ఇన్ఫో ఎడ్జ్ నుంచి నిధులు లభించడంతో గోయల్, ఆయన బృందం తమ ఉద్యోగాలను వీడి జొమాటో వృద్ధిపై పూర్తిగా దృష్టి పెట్టారు. జొమాటో 2018లో యునికార్న్‌గా మారింది.

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు