చైనా కుబేరుడి కంటే అంబానీ సంపద రెండింతలు!

Published on Wed, 10/30/2024 - 10:21

చైనాలోని అత్యంత ధనవంతుల జాబితాను ‘హురున్‌ చైనా రిచ్‌ లిస్ట్‌’ పేరుతో విడుదల చేశారు. అందులో బైట్‌డ్యాన్స్‌ సంస్థ వ్యవస్థాపకుడు జాంగ్ యిమింగ్ మొదటిస్థానంలో నిలిచారు. ఈయన సంపద దాదాపు 49.3 బిలియన్‌ డాలర్లు(రూ.4.11 లక్షల కోట్లు)గా ఉందని హురున్‌ నివేదించింది. అయితే తన సంపద గతంలో కంటే పెరిగినప్పటికీ భారత్‌లో అత్యంత ధనవంతుడిగా కొనసాగుతున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీను మాత్రం మించలేకపోయారు.

చైనాలో కుబేరుల పెరుగుదల తగ్గిపోతుందని హురున్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ తెలిపింది. ఇటీవల భారీగా తగ్గిన చైనా ఆర్థిక వ్యవస్థ, స్టాక్ మార్కెట్ల ప్రభావంతో ఈ పరిస్థితులు నెలకొన్నాయని పేర్కొంది. ప్రస్తుతం చైనా కుబేరుల మొత్తం సంపద మూడు ట్రిలియన్‌ డాలర్లు(రూ.250 లక్షల కోట్లు)గా ఉంది. అయితే ఇది గతంలోకంటే 10 శాతం తగ్గినట్లు హురున్ నివేదిక ఛైర్మన్ రూపెర్ట్ తెలిపారు.

చైనా కంటే భారత్‌లో పెరుగుదల

చైనాలో బిలియనీర్ల జాబితా తగ్గిపోతుంది. అందుకు భిన్నంగా భారత్‌లో మాత్రం వారి సంఖ్య పెరుగుతోంది. ఆగస్టులో విడుదల చేసిన హురున్ ఇండియా రిచ్ లిస్ట్ ప్రకారం..భారత్‌ గతంలో కంటే 29 శాతం బిలియనీర్ల సంఖ్యను పెంచుకుంది. ఇది రికార్డు స్థాయిలో 334కు చేరుకుంది. అయితే, మొత్తం బిలియనీర్ల సంఖ్య విషయానికి వస్తే భారతదేశం ఇప్పటికీ చైనా కంటే వెనుకబడే ఉంది. చైనాలో 753 మంది బిలియనీర్లు ఉన్నారు.

ఇదీ చదవండి: కొత్త అప్‌డేట్‌..యాపిల్‌లో అదిరిపోయే ఫీచర్‌!

చైనా కుబేరుడు జాంగ్ యిమింగ్

హురున్‌ నివేదిక ప్రకారం జాంగ్ యిమింగ్(41) సంపద నికర విలువ 49.3 బిలియన్‌ డాలర్లు(రూ.4.11 లక్షల కోట్లు). ఆన్‌లైన్‌ షార్ట్ వీడియో షేరింగ్‌ ప్లాట్‌ఫామ్‌లు డౌయిన్, టిక్‌టాక్ మాతృ సంస్థ బైట్‌డాన్స్ సంస్థ వ్యవస్థాపకుడు యిమింగ్‌. కాగా, భారతదేశపు అత్యంత ధనవంతుడు ముఖేష్ అంబానీ సంపద నికర విలువ 102 బిలియన్‌ డాలర్ల(రూ.8.5 లక్షల కోట్లు)కు చేరుకుంది. అంబానీ సంపద గతేడాది కంటే 25 శాతం పెరిగింది.

Videos

నచ్చకపోతే వెళ్లిపోండి జపాన్ క్రికెట్ CEO బీసీసీఐకి షాక్

ఇచ్చి ఒక నెల కూడా కాలేదు లోకేష్ ని ఏకిపారేసిన శ్రీదేవి

చంద్రబాబు చీప్ పబ్లిసిటీపై వైఎస్ జగన్ ఆగ్రహం

డబ్బు కోసం స్నేహితుడినే కిడ్నాప్.. పట్టించిన వాట్సాప్ మెసేజ్

అమెరికా పునాదులు కదిలిస్తాం?

రేవెంత్ కు కొండా పంచ్ అదిరిపోయే పంచ్

దులీప్ ట్రోపి ఫైనల్ నుండి వైభవ్ అవుట్?

నన్ను టార్గెట్ చేస్తే.. ఎమ్మెల్యేలకు కొండా హెచ్చరిక

Garam Garam : బావిపై వేలాడిన ఆర్టీసీ బస్సు

విజయవాడలో హైటెన్షన్ విద్యా భవన్ ముట్టడి

Photos

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)

+5

పని.. ‍ప్రకృతిలో మమేకం.. శ్రీనిధి జ్ఞాపకాలు (ఫొటోలు)