Breaking News

యూట్యూబ్‌లో కొత్త ఫీచర్స్.. ఇవెలా పనిచేస్తాయంటే?

Published on Mon, 08/12/2024 - 16:17

టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న తరుణంలో సంస్థలు కూడా యూజర్లకు అనుగుణంగా తమ యాప్‌లను అప్డేట్ చేయడం లేదా కొత్త ఫీచర్స్ తీసుకురావడం చేయాలి. ఇందులో భాగంగానే గూగుల్ యాజమాన్యంలోని వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ మూడు కొత్త ఫీచర్‌ను తీసుకువచ్చింది. ఇవన్నీ యూట్యూబ్ ప్రీమియం యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంటాయి.

స్లీప్ టైమర్ ఫీచర్
పేరుకు తగ్గట్టుగానే.. యూజర్ ఏదైనా కంటెంట్‌ను చూస్తున్నప్పుడు లేదా వింటున్నప్పుడు టైమర్‌ను సెట్ చేసుకోవచ్చు. సెట్ చేసుకున్న టైమ్ తరువాత వీడియోని ఆటోమేటిక్‌గా పాజ్ చేయవచ్చు. వీడియో చూస్తూ నిద్రపోయే వ్యక్తులకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. యూజర్లు మొబైల్, డెస్క్‌టాప్‌లోని సెట్టింగ్‌ల మెను నుంచి స్లీప్ టైమర్ ఫీచర్‌ను యాక్సెస్ చేయవచ్చు.

డ్రీమ్ స్క్రీన్ ఫీచర్
ఇది క్రియేటర్లకు ఉపయోగపడే ఫీచర్. ఇది మొబైల్ యాప్‌లో పనిచేస్తుంది. 'ఏఐ'ను ఉపయోగించి గ్రీన్ స్క్రీన్ బ్యాక్‌గ్రౌండ్‌లను క్రియేట్ చేసుకోవడానికి యూజర్లను అనుమతిస్తుంది. షార్ట్ కెమెరా ఓపెన్ చేయడానికి వినియోగదారులు ప్లస్ (+) చిహ్నం మీద క్లిక్ చేసి.. గ్రీన్ స్క్రీన్ ఎంచుకోవచ్చు. ఈ ఆప్షన్స్ అన్నీ కూడా ప్రస్తుతం ఇంగ్లీష్ భాషలో మాత్రమే కనిపిస్తాయి.

ఆన్సర్ బాట్ ఫీచర్
ప్రత్యేకించి ఈ ఫీచర్‌ను మొబైల్ యూజర్ల కోసం పరిచయం చేశారు. వీడియో బ్యాక్‌గ్రౌండ్‌లో ప్లే అవుతున్నప్పుడు వీడియోకు సంబంధించి అనుమానాలు వస్తే.. వాటిని పరిష్కరించుకోవడానికి ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. ఇది కూడా ఏఐ బేస్డ్ ఫీచర్. యూట్యూబ్‌లోని అన్ని వీడియోలు ఈ కొత్త ఫీచర్‌ను కలిగి ఉండవు. ఇది వీడియో కింద ఉన్న ఆస్క్ ట్యాబ్ రూపంలో అర్హులైనవారికి మాత్రమే వీడియోలలో కనిపిస్తుంది. యూజర్లు ముందుగా సెట్ చేసిన ప్రశ్నలను ఎంచుకోవడం మాత్రమే కాకుండా.. సొంత ప్రశ్నలను టైప్ చేసుకునే వెసులుబాటు ఇందులో ఉంటుంది.

యూట్యూబ్ కొత్త ఫీచర్స్ కొన్ని రోజులు వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. స్లీప్ టైమర్ ఫీచర్‌ సెప్టెంబర్ 2 వరకు, డ్రీమ్ స్క్రీన్ ఫీచర్ ఆగస్ట్ 20 వరకు, ఆన్సర్ బాట్ ఫీచర్ ఆగస్ట్ 21 వరకు మాత్రమే ఉపయోగించుకోవచ్చు. ఎందుకంటే ఇవన్నీ ప్రయోగాత్మక దశలోనే ఉన్నాయి. టెస్టింగ్ పూర్తయిన తరువాత భవిష్యత్తులో ఇవి వినియోగంలోకి వస్తాయి. కానీ ఇప్పుడునా వస్తాయి అనేది తెలియాల్సి ఉంది.

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)