యూట్యూబ్‌లో డబ్బు సంపాదించడం మరింత కష్టం!

Published on Tue, 08/11/2026 - 11:50

డిజిటల్ కంటెంట్ ద్వారా ఆదాయం ఆర్జించాలనుకుంటున్న క్రియేటర్లకు ప్రముఖ వీడియో ప్లాట్‌ఫామ్ ‘యూట్యూబ్’ ఊహించని షాక్ ఇచ్చింది. యూట్యూబ్ పార్ట్‌నర్ ప్రోగ్రామ్ (వైపీపీ) ద్వారా యాడ్స్, సబ్‌స్క్రిప్షన్ల నుంచి డబ్బులు సంపాదించడానికి అవసరమైన ప్రాథమిక అర్హత ప్రమాణాల్లో మార్పులను తీసుకొస్తున్నట్లు ప్రకటించింది.

కొత్త నిబంధనలు ఇవే..

ప్రస్తుతం చలామణిలో ఉన్న నిబంధనల ప్రకారం కంటెంట్ క్రియేటర్లు ఏడాది కాలంలో (365 రోజుల్లో) 4,000 గంటల వాచ్ టైమ్ సాధించాల్సి ఉంది. నూతన ఉత్తర్వుల ప్రకారం ఇకపై 8,000 గంటల వాచ్ టైమ్ పూర్తి చేయాల్సి ఉంటుంది. అలాగే, యూట్యూబ్ షార్ట్స్ ద్వారా మానిటైజేషన్ పొందాలనుకునే వారు గత 90 రోజుల్లో పొందే వ్యూస్ పరిమితిని 10 మిలియన్ల నుంచి 20 మిలియన్లకు (2 కోట్లు) పెంచారు. అయితే, కనీసం 1,000 మంది సబ్‌స్క్రైబర్లు ఉండాలనే పాత నిబంధనలో ఎలాంటి మార్పూ చేయలేదు.

ఈ నూతన నిబంధనలు 2027 ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. దీనితో పాటు, ఇప్పటికే మానిటైజేషన్ పొందుతున్న క్రియేటర్లు కూడా షార్ట్స్ ద్వారా ఆదాయం కొనసాగించాలంటే ప్రతి 90 రోజుల వ్యవధిలో నిరంతరం 10 మిలియన్ల వ్యూస్ నిర్వహించడం తప్పనిసరి అని స్పష్టం చేసింది.

ఎందుకు ఈ నిర్ణయం?

ఇటీవలి కాలంలో ప్లాట్‌ఫామ్‌పై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో రూపొందించిన లో-క్వాలిటీ, కాపీడ్, రీసైకిల్డ్ కంటెంట్ విపరీతంగా పెరిగిపోయింది. నాణ్యమైన అసలైన కంటెంట్ సృష్టికర్తలకు ప్రాధాన్యత ఇవ్వడానికి, ప్రకటనకర్తల నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి గూగుల్ ఈ కఠిన చర్యలు చేపట్టింది.

చిన్న క్రియేటర్లపై ప్రభావం

యూట్యూబ్‌ను పూర్తికాల కెరీర్‌గా ఎంచుకోవాలని భావిస్తున్న ఔత్సాహిక క్రియేటర్లకు, చిన్న ఛానెళ్ల నిర్వాహకులకు ఈ నిర్ణయం గొడ్డలిపెట్టుగా మారనుంది. ఆదాయ మార్గాలు సాధించాలంటే మునుపటి కంటే రెండింతలు శ్రమించాల్సి రావడంతో ప్రారంభ దశలోనే అనేకమంది నిరాశకు గురయ్యే అవకాశాలున్నాయని సాంకేతిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.

ఇదీ చదవండి: ఆకాశమే హద్దుగా పసిడి ధరలు.. ఒక్కరోజే ఇంతలా..

Videos

భారతి సిమెంట్స్ కేసులో కూటమి ప్రభుత్వానికి గట్టి షాకిచ్చిన హైకోర్టు

చిరు NEXT మూవీ టైటిల్ లీక్.. వద్దు వద్దు అంటున్న ఆపుకోలేక నోరు జారిన చిరంజీవి

ఆ సీఐ చుట్టూ కూటమి రాజకీయం..!

LB నగర్ పీఎస్ లో కానిస్టేబుల్ ఆత్మహత్య

కేకును కోస్తే అరెస్ట్ చేసి నడి రోడ్డుపై నడిపించారు.. మెడికల్ విద్యార్థిని ప్రియాంకను చంపేస్తే మాత్రం వారిని

నేడు MLA, MLCలతో వైఎస్ జగన్ కీలక సమావేశం

నా కాలు విరిగినా.. నా ప్రాణం పోతాదన్నా జగనన్న కోసం ఎలాంటి కష్టానైనా...

EVM ట్యాపరింగ్ జరిగిందో లేదో చంద్రబాబే చెప్పాలి..! ఉండవల్లి అరుణ్ కుమార్ షాకింగ్ కామెంట్స్

రాజమండ్రి పోలీసులు అందరూ ఎలాంటివారంటే..! డాక్టర్ ప్రియాంక ఘటనపై అడ్వకేట్ బాల కామెంట్స్

నా భర్తను అక్రమంగా అరెస్ట్ చేసి... సీదిరి అప్పలరాజు భార్య సంచలన వ్యాఖ్యలు

Photos

+5

హైదరాబాద్‌లో మొదలైన వినాయక చవితి 2026 సందడి (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ మూవీ టీజర్ రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

‘విశ్వనాథ్ & సన్స్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌...(ఫొటోలు)

+5

‘కొరియన్ కనకరాజు’ సక్సెస్ సెలబ్రేషన్స్‌...ముఖ్య అతిథిగా చిరంజీవి (ఫొటోలు)

+5

హాఫ్ శారీలో చిన్న పిల్లలా హీరోయిన్ నభా నటేశ (ఫొటోలు)

+5

ఫైరింగ్ కియారా.. అందం ఏ మాత్రం తగ్గలే (ఫొటోలు)

+5

ఐశ్వర్య రాజేశ్ ఇంతలా మారిపోయిందేంటి? (ఫొటోలు)

+5

యంగ్ హీరోతో నయన్ లవ్ పోజులు (ఫొటోలు)

+5

‘అగధ’ మూవీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్ (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం క్యూట్ ఫ్యామిలీ.. వెకేషన్ (ఫొటోలు)