Breaking News

యూట్యూబ్ డౌన్!.. స్పందించిన కంపెనీ

Published on Thu, 10/16/2025 - 07:05

బుధవారం సాయంత్రం యూట్యూబ్ (Youtube) వినియోగించడంలో అంతరాయం ఏర్పడింది. సుమారు 3,20,000 మందికి పైగా ఈ సమస్యను ఎదుర్కొన్నట్లు డౌన్‌డెటెక్టర్ (Downdetector) వెల్లడించింది. దీనిపై సంస్థ స్పందించింది. దీనికి సంబంధించిన ట్వీట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వేలాది మంది యూట్యూబ్ మ్యూజిక్, టీవీ సేవలలో సమస్యలు ఉన్నట్లు వెల్లడించారు. 'ఎర్రర్ సంభవించింది, దయచేసి తర్వాత మళ్ళీ ప్రయత్నించండి' వంటి ఎర్రర్ సందేశాలను చూసినట్లు లేదా డెస్క్‌టాప్ & మొబైల్ యాప్‌లు రెండింటిలోనూ ఖాళీ బ్లాక్ స్క్రీన్‌లను చూసినట్లు వినియోగదారులు నివేదించారు.

''మీరు ప్రస్తుతం YouTubeలో వీడియోలను ప్లే చేయలేకపోతే, మేము దాన్ని పరిష్కరిస్తున్నాము! మీ ఓర్పుకు ధన్యవాదాలు'' అంటూ టీమ్ యూట్యూబ్ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేసింది.

యూట్యూబ్ అంతరాయానికి కారణం ఏమిటనే విషయాన్ని కంపెనీ వెల్లడించేలేదు. అయితే దీని పరిష్కారానికి టీమ్ యూట్యూబ్ చురుగ్గా పనిచేస్తోంది. యూట్యూబ్ అంతరాయం యునైటెడ్ స్టేట్స్ అంతటా వినియోగదారులను ప్రభావితం చేసింది. డౌన్‌డెటెక్టర్ నుండి వచ్చిన డేటా ప్రకారం.. న్యూయార్క్, లాస్ ఏంజిల్స్, శాన్ ఫ్రాన్సిస్కో, సీటెల్, ఫీనిక్స్, చికాగో, వాషింగ్టన్, డెట్రాయిట్ వంటి పట్టణ కేంద్రాల నుంచి అత్యధిక సంఖ్యలో నివేదికలు వస్తున్నాయి. ఈ సమస్య అమెరికాలో మాత్రమే కాకుండా.. భారత్, యూరప్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో కూడా కూడా తలెత్తిందని సమాచారం.

#

Tags : 1

Videos

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)