Breaking News

యూట్యూబ్‌లో థంబ్‌నేల్స్‌ చేస్తున్నారా..? ఇకపై అది కుదరదు!

Published on Sun, 12/22/2024 - 10:13

వ్యూస్‌ పెంచుకునేందుకు వీడియో అప్‌లోడర్లు చేస్తున్న అనైతిక ప్రయత్నాలకు చెక్‌ పెట్టేలా యూట్యూబ్‌ చర్యలకు సిద్ధమైంది. వీడియోను ఎక్కువ మంది వీక్షించాలనే ఉద్దేశంతో చాలామంది యూట్యూబర్లు ఆకర్షణీయ థంబ్‌నేల్స్‌ పెడుతుంటారు. అలా పెట్టడం తప్పుకాదు.. కానీ, అసలు వీడియోలో ఉన్న కంటెంట్‌తో సంబంధం లేకుండా కొందరు థంబ్‌నేల్స్‌ పెట్టి వీక్షకులను మభ్యపెడుతుంటారు. అలాంటి వారిపై యూట్యూబ్‌ చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది.

రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, గతంలో జరిగిన అంశాలు, ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా ఉన్న సమాచారం.. వంటి ఎన్నో అంశాలను వ​క్రీకరించి యూట్యూబ్‌లో తప్పుడు సమాచారాన్ని వ్యాపింప జేస్తున్నారు. దాన్ని కట్టడి చేసేందుకు యూట్యూబ్‌ త్వరలో కొత్తగా నిబంధనలు ప్రకటించబోతున్నట్లు స్పష్టం చేసింది. వీక్షకులను తప్పుదోవ పట్టించేలా వీడియోలు అప్‌లోడ్‌ చేయడం, తప్పుడు సమాచారం ఉన్న థంబ్‌నేల్స్‌ క్రియేట్‌ చేసి అప్‌లోడ్‌ చేస్తే రానున్న రోజుల్లో కఠిన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపింది.

ఇదీ చదవండి: సైబర్‌ నేరాలపై వినూత్నంగా అవగాహన

కొత్తగా తీసుకురాబోయే నిబంధనలు పాటించని వారి వీడియోలను ప్రైమరీగా డిలీట్‌ చేస్తామని పేర్కొంది. రెండోసారి తిరిగి అలాగే నిబంధనలను విస్మరిస్తే ఛానల్‌ను తాత్కాలికంగా నిలిపేయబోతున్నట్లు(ఛానల్‌ స్ట్రైక్‌) హెచ్చరించింది. తప్పుదోవ పట్టించే కంటెంట్‌ ద్వారా యూట్యూబ్‌పై విశ్వాసం సన్నగిల్లే ప్రమాదం ఉన్నట్లు కంపెనీ వివరించింది. వీక్షకుల్లో విశ్వాసం నింపాలంటే స్పష్టమైన, వాస్తవమైన, ఉల్లంఘనలు అతిక్రమించని, తప్పుదోవ పట్టించని కంటెంట్‌ను అప్‌లోడ్‌ చేయాలని యూట్యూబర్లకు సూచించింది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)